Ex-Minister Dance: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో.. మాజీమంత్రి రఘువీరారెడ్డి జనంతో కలిసి సరదాగా నృత్యాలు చేశారు. రఘువీరా కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో.. శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించారు. ఆఖరి రోజు నీలకంఠేేశ్వర ఆలయంలో ఉట్లమాను ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరా డప్పు దరువులకు నృత్యాలు చేశారు.
శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు హారతులు, ఉట్లమాను ఉత్సవ కార్యక్రమాలతో ముగిశాయి. ఆలయం ముందర ఏర్పాటు చేసిన ఉట్లమాను ఉత్సవాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఉట్లమాను పైకి ఎక్కే యువకులను రఘువీరారెడ్డి ప్రోత్సహిస్తూ వారిని ఉత్సాహపరిచారు. కార్యక్రమం అనంతరం సాదాసీదా వ్యక్తిలా యువకులతో కలిసి.. రఘువీరా డప్పులకు అనుగుణంగా చిందులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఇదీ చదవండి: CM KCR on Tamilisai: గవర్నర్‌పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు!!