ETV Bharat / city

కరోనాతో ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావు కన్నుమూత

author img

By

Published : Aug 1, 2020, 3:52 PM IST

Updated : Aug 1, 2020, 4:31 PM IST

manikyalarao
manikyalarao

15:51 August 01

కరోనాతో ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావు కన్నుమూత

భాజపా నేత, ఏపీ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కన్నుమూశారు. కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతూ విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వెంటిలేటర్​పై ఆయన చికిత్స పొందుతున్నారు. 20 రోజుల క్రితం ఏలూరు కొవిడ్​ ఆస్పత్రిలో చేరిన ఆయనను.. మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు.

దిల్లీ ఎయిమ్స్​ వైద్యుల పర్యవేక్షణలో మాణిక్యాలరావుకు చికిత్స అందించారు. 5 రోజులుగా ఆయన వెంటిలేటర్​పైనే ఉన్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతి పట్ల భాజపా నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రస్థానం

  • 1961 నవంబర్‌ 1న తాడేపల్లిగూడెంలో జన్మించిన పైడికొండల మాణిక్యాలరావు
  • తాడేపల్లిగూడెంలో పాఠశాల విద్య, పెంటపాడులో కళాశాల విద్య అభ్యసించిన మాణిక్యాలరావు
  • పైడికొండల మాణిక్యాలరావుకు భార్య సూర్యకుమారి, కుమార్తె సింధు
  • తెదేపా-భాజపా కూటమి అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక
  • తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నిక
  • 2014లో తెదేపా ప్రభుత్వంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు
  • చిన్నప్పటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేసిన మాణిక్యాలరావు
  • 9 ఏళ్ల వయస్సులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో చేరిన మాణిక్యాలరావు
  • భాజపా ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగుతున్న మాణిక్యాలరావు
  • ఫొటోగ్రాఫర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన మాణిక్యాలరావు
  • ఫోటోస్టూడియో మూసివేసి 'సింధు షూమార్ట్' ప్రారంభించిన మాణిక్యాలరావు
  • సింధు ఎంటర్‌ప్రైజెస్‌గా మార్చి ఆటోమొబైల్ విడిభాగాల విక్రయాలు చేసిన మాణిక్యాలరావు
  • 2011-2013 వరకు మానవత సంస్థ తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షునిగా సేవా కార్యక్రమాలు
  • మానవత సేవా సంస్థ ద్వారా జిల్లాలోని పలు పట్టణాల్లో శీతల శవపేటికలు ఉచితంగా ఏర్పాటు

Last Updated : Aug 1, 2020, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.