ETV Bharat / city

Army helicopter crash: 'ఒక్కసారిగా తలెత్తిన తీవ్ర సాంకేతిక లోపమే కారణం..!' - Army helicopter crash updates

Army helicopter crash: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మరణం పట్ల రిటైర్డ్ మేజర్ భరత్ సింగిరెడ్డి విచారం వ్యక్తం చేశారు. తమిళనాడు కూనూర్ వద్ద జరిగిన ప్రమాదం.. అక్కడి భౌగోళిక ప్రతికూల పరిస్థితులు, హెలికాప్టర్​లో సాంకేతిక లోపాల కారణంగా ప్రమాదం సంభవించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. త్రివిధ దళాధిపతిగా రక్షణ వ్యవస్థల ఇంటిగ్రేషన్ కొరకు బిపిన్ రావత్ అలుపెరుగని సేవలు చేశారని.. సీడీఎస్ చీఫ్​గా ఆయన లేని లోటు భారత రక్షణ వ్యవస్థకు అతిపెద్ద సవాలు అని పేర్కొన్నారు. ప్రమాద తీరు, జనరల్ బిపిన్ రావత్​ సేవలపై ఈటీవీ భారత్​తో రిటైర్డ్ మేజర్ భరత్ సింగిరెడ్డి ముఖాముఖి..

ex army officer bharath singireddy interview general Bipin Rawat helicopter crash

author img

By

Published : Dec 8, 2021, 10:56 PM IST

Army helicopter crash: "ఈరోజు జరిగిన ఘటన దౌర్భగ్యకరం. దేశం మొత్తానికి షాకింగ్ రోజు​. ఈరోజు జరిగిన ఘటనను నాలుగు గోడల మధ్య కూర్చొని నిర్ధరించేది కాదు. పూర్తి వివరాలు లేకుండా ఏదో ఓ నిర్ణయానికి రాలేము. కానీ.. ఫొటోలను బట్టి చూస్తే సాంకేతిక లోపం వల్ల అత్యవసర ల్యాండింగ్​ చేసినట్టు నాకనిపిస్తోంది. అనుకూల పరిస్థితులు లేక.. అనుకోని పరిస్థితుల్లోనే.. దట్టమైన చెట్లు ఉన్న చోట ఫోర్స్​ఫుల్​ ల్యాండింగ్​ జరిగినట్టు కనిపిస్తోంది. ఆ ప్రయత్నంలో క్రాష్​ అయ్యాక జరిగిన అగ్నిప్రమాదంలోనే ఎక్కువ మంది దుర్మరణం చెంది ఉంటారని నా అభిప్రాయం. ప్రోటోకాల్​ పరంగా ఎలాంటి లోపం ఉన్నట్టు నేననుకోను. జనరల్​ బిపిన్​ రావత్​ ఉన్నతాధికారి కాదు.. అందరికంటే ఉన్నతమైన అధికారి. ఆయనకు తీసుకున్నన్ని భద్రతా చర్యలు ఇంకెవరికి తీసుకోరు. ఎమ్​-17 వీ5 లో అన్ని అడ్వాన్స్​ టెక్నాలజీస్​ ఉన్నాయి. ఇందులో లేని సాంకేతికత లేదు. లోడ్​ పరంగా గానీ.. పరిధి పరంగా గానీ... ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది కొత్త ప్రాంతం కావటం వల్ల.. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

ఫోర్స్ ల్యాండింగ్​ ఒక్కటే మార్గం..!

ఈ ప్రమాదానికి రెండే రెండు కారణాలు కన్పిస్తున్నాయి. ఒక్కసారిగా తలెత్తిన తీవ్ర సాంకేతిక లోపం.. లేదా ప్రతికూల వాతవరణ పరిస్థితులు. ఇప్పుడు వచ్చిన ఫొటోలను బట్టి చూస్తుంటే.. పెద్ద పెద్ద చెట్లు విరిగిపోయి కన్పిస్తున్నాయి. హెలికాప్టర్​ బలంగా వచ్చి పడినట్టు తెలుస్తోంది. కాబట్టి.. ఒక్కసారిగా తీవ్ర సాంకేతిక లోపం తలెత్తినట్టు చూడొచ్చు. ఇలాంటి సందర్భంలో.. పైలెట్​కు ఫోర్స్​ ల్యాండింగ్​ ఒక్కటే మార్గం. దాని కోసం ఏదైన అనుకూల ప్రదేశం దొరకని సమయంలో.. లేదా.. పైలెట్​ ఆలోచించుకునేంత సమయంలేని తీవ్ర సాంకేతిక లోపం తలెత్తినప్పుడు ఫోర్స్​ఫుల్​ ల్యాండింగ్​ తప్పనిసరి. దాని వల్ల క్రాష్​ అయ్యి.. అగ్నిప్రమాదం జరగటం వల్లే మనకు ఎక్కువ నష్టం జరిగినట్టు అనిపిస్తోంది." - రిటైర్డ్ మేజర్ భరత్ సింగిరెడ్డి

'ఒక్కసారిగా తలెత్తిన తీవ్ర సాంకేతిక లోపమే కారణం..!'

సంబంధిత కథనాలు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.