'కొత్త చట్టాలు అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది' - Telangana latest news
కనీస మద్దతు ధర లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కొనుగోళ్లు సాధ్యం కాదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర కొత్త చట్టాలు అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులు ఇచ్చే బాధ్యత నుంచి కేంద్రం దశలవారీగా తప్పుకునేందుకు చూస్తోందని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్, చెరుకు, కూరగాయల సాగుపై అధ్యయనం జరుగుతోందని వెల్లడించారు. సమగ్ర ఉద్యానవన పంటల సాగుపై సీఎం త్వరలో విధానపర నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఈటీవీ భారత్ ముఖాముఖిలో నిరంజన్ రెడ్డి వెల్లడించారు
మంత్రి నిరంజన్‌రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి
ఇవీ చూడండి: రైతుబంధు ఖాతాల్లో రూ. 5,660 కోట్లు జమ
TAGGED:
interview with Niranjanreddy