1. రావి కొండలరావు ఇకలేరు
ప్రముఖ నటుడు రావి కొండలరావు (88) గుండెపోటుతో కన్నుమూశారు. బేగంపేటలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ఇంటర్ రీ వెరిఫికేషన్ ఫలితాలు విడుదల
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాలు నేడు వెల్లడయ్యాయి. ఈ మేరకు సవరించిన మార్కులు, జవాబు పత్రాలను వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. మూడు రోజులు వర్షాలే.. వర్షాలు
రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కరోనాను సీరియస్‌గా తీసుకోండి
లోక్ సభ ఎన్ఐసీ వెబ్ఎక్స్ ద్వారా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తెరాస లోక్ సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో కేంద్ర ఆరోగ్య, సంక్షేమశాఖ మంత్రి హర్షవర్ధన్ సంబంధిత వైద్యులు వివిధ పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఏపీలో తగ్గని కరోనా విజృంభణ
ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. 24 గంటల వ్యవధిలో 7,948 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. మొత్తం బాధితుల సంఖ్య 1,10,297కు చేరింది. మహమ్మారి బారిన పడి మరో 58 మంది మృతి చెందగా.. ఇప్పటివరకు 1,148 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. ఇదే సరైన సమయమని
కొవిడ్ విపత్కర సమయంలో అక్రమాలకు తెరలేవడంతో ఎగుమతులు, దిగుమతులపై కస్టమ్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అక్రమార్కుల ఎత్తులను చిత్తు చేసే దిశలో చర్యలు చేపట్టారు. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి అనుమానం వచ్చిన... ప్రతి పార్శిల్‌ను తనిఖీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇటీవల సనత్‌నగర్ ఐసీడీ కార్గోలో దుబాయ్ నుంచి వచ్చిన పార్శిల్‌పై అనుమానం వచ్చి పరిశీలించగా భారీగా అక్రమాలు వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు... దిగుమతిదారుడి గత చరిత్రపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. దేశంలో పెరిగిన రికవరీలు
దేశంలో రోజుకు వేలమంది వైరస్ బారిన పడుతుండగా.. కోలుకున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. కొత్తగా సుమారు 35 వేల మంది డిశ్చార్జ్ కాగా.. మొత్తంగా రికవరీ రేటు 64 శాతానికిపైగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. బలగాల ఉపసంహరణ పూర్తి
భారత్- చైనా సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాల నుంచి సైనికుల ఉపసంహరణ పూర్తయినట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ వెల్లడించారు. త్వరలోనే తదుపరి దశ సైనిక స్థాయి చర్చలు జరగనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. పసిడి కాస్త కనికరించింది
బంగారం ధర దిల్లీలో 10 గ్రాములకు రూ. 187 తగ్గింది. వెండి కిలోకు సుమారు రెండు వేల రూపాయల వరకు క్షీణించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. ప్రముఖ బాలీవుడ్ నటి కన్నుమూత
బాలీవుడ్ సీనియర్ నటి కుంకుమ్ అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 'మిస్టర్ ఎక్స్ ఇన్ బాంబే', 'మథర్ ఇండియా' వంటి హిట్ సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.