1. రాష్ట్రంలో మరో 1,593 కరోనా కేసులు
రాష్ట్రంలో శనివారం 15,654 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా... వారిలో 1,593 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 54,059కు చేరింది. ఇప్పటివరకు 3,53,425 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. మూడు రోజుల్లో సచివాలయం నేలమట్టం
రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో సచివాలయ భవనాలు నేలమట్టం కానున్నాయని అధికారులు భావిస్తున్నారు. కూల్చివేత పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. వ్యర్థాలను సైతం తొలగిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం
పెద్దపల్లి జిల్లా మంథనిలో కాంగ్రెస్ నాయకులు చేపట్టిన 'ఛలో మల్లారం' కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరికొందరిని గృహనిర్బంధం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కార్గిల్ స్ఫూర్తితో కరోనాపై పోరాడదాం
'కార్గిల్ విజయ్ దివస్' వేళ జవాన్ల శౌర్య, పరాక్రమాలపై ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. దేశ రక్షణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు.. జవాన్ల గురించి యోచించాలన్న వాజ్‌పేయీ వ్యాఖ్యలు సదా ఆచరణీయమన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు పెరిగిందన్న ప్రధాని.. కార్గిల్ స్ఫూర్తితో కరోనాను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. పీపీఈ కిట్లపై నిర్లక్ష్యం.. జంతువుల పాలిట శాపం
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యక్తిగత భద్రతలో పీపీఈ కిట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వాటి వల్ల ఉపయోగం ఎంత ఉందో.. వాడేసిన తర్వాత సరైన రీతిలో పడేయకపోతే అంతే నష్టం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అధికారుల నిర్లక్ష్యం.. మూగ జీవాల పాలిట శాపంగా మారుతోంది. ఓసారి వాటి వివరాలు తెలుసుకుందాం రండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. హరికేన్ హన్నా బీభత్సం...
కరోనా వైరస్ ఉద్ధృతితో ఇబ్బందులు పడుతున్న అమెరికాను హరికేన్ హన్నా వణికిస్తోంది. శనివారం సాయంత్రం రెండోసారి తీరం దాటిన ఈ తుపాను.. టెక్సాస్ తీరప్రాంతంలో పెను గాలులకు కారణమైంది. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడం వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. మొద్దు నిద్ర పోండి.. కరోనాను తరిమికొట్టండి..!
కరోనా గురించి ఆలోచిస్తుంటే నిద్ర పట్టడంలేదా? కానీ కొవిడ్ నివారణకు నిద్ర చాలా ముఖ్యమంటున్నారు వైద్యులు. ఎంత ప్రయత్నించినా.. నిద్ర పడితేగా అంటారా ఐతే ఇలా చేసి చూడండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. 'ఐపీఎల్ వల్ల ఎంతో మందికి జీవనోపాధి'
ఐపీఎల్‌ను నిర్వహించడం ద్వారా అభిమానుల్లో ఉత్సాహం సహా టోర్నీ జరిపే దేశం ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని మాజీ క్రికెటర్ సంగక్కర చెప్పాడు. లీగ్ వల్ల చాలా మందికి పని దొరుకుతుందని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ఐసోలేషన్ వార్డులో అమితాబ్ పాట
వైరస్ సోకి ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న అమితాబ్.. తన అనుభవాలను బ్లాగ్ వేదికగా పంచుకున్నారు. ఒంటరిగా ఉన్న సమయంలో పాటలు పాడుకున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. తోటలో తారలు
ఎప్పుడూ మేకప్పులు, సినిమాల్లో మునిగిపోయి ఉండే తారలు తోటల బాట పట్టారు. మట్టితో చెలిమి చేస్తున్నారు. కరోనా కారణంగా షూటింగులు లేకపోవడంతో చాలా మంది నటీనటులు తమ ఖాళీ సమయాన్ని పచ్చని మొక్కల మధ్యలో గడిపేస్తున్నారు. తోటపనిని ఆస్వాదిస్తూ ఆహ్లాదం పొందుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.