ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌@ 11AM - ts news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN NEWS
టాప్‌టెన్‌ న్యూస్‌@ 11AM
author img

By

Published : Jul 26, 2020, 11:00 AM IST

1. భారత్​లో ఒక్కరోజే 48,661 కేసులు

దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలోనే కొత్తగా 48,661 కేసులు నమోదవగా.. 705 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 13 లక్షల 85 వేలు దాటాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

2. కూసింత మానవత్వం ఉండాలి

చరిత్రలో వర్ణ, కుల, మత వివక్షలు ఇప్పటి వరకూ చూశాం. ఇప్పుడు వీటికి కరోనా వివక్ష కూడా తోడైంది. ఫలానా వ్యక్తికి కరోనా సోకిందంటే చాలు... బాధితుడి కన్నా చుట్టుపక్కల వాళ్లే ఎక్కువ ఆదుర్దా అవుతున్నారు. అంతెందుకు..? ఇంట్లో వాళ్లే వింత జంతువుని చూసినట్టు చూస్తున్నారు. అదేమంటే.. ఒక్కొక్కరి నుంచి ఒక్కో సమాధానం. కరోనా సోకిందని ఇల్లు ఖాళీ చేయాలని ఒకరు..అసలు ఇంటికే రావొద్దని మరొకరు! ఈ వైరస్ ఎన్నో గుణపాఠాలు నేర్పింది అనుకుంటున్నాం కానీ...ముందుగా మనం నేర్చుకోవాల్సిన పాఠం... మానవత్వం. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

3. క్రికెటర్ సచిన్‌కు చెరువు శిఖం భూములు

ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌కు స్థిరాస్తి సంస్థ ఆదిత్య హోమ్స్‌ చెరువు శిఖం భూములు అమ్మిందని స్వయానా ఆ సంస్థ డైరెక్టర్‌ బి.సుధీర్‌రెడ్డి ఆరోపించారు. సినీతారలు రమ్యకృష్ణ, నయనతార సహా పలువురు ఎంపీలకూ అలాంటి భూములే విక్రయించిందని ఆక్షేపించారు. ఇటీవల సంస్థ భాగస్వాముల మధ్య వివాదాలు తలెత్తగా, అవి కాస్తా పోలీసు కేసుల వరకు వెళ్లాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

4. ఏవోబీలో ఎదురుకాల్పులు

ఆంధ్ర- ఒడిశా సరిహద్దులో మరోసారి తుపాకీ గర్జించింది. ఆదివారం తెల్లవారుజామున మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మరణించినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

5. 'జవాన్ల శౌర్య, పరాక్రమాలతోనే కార్గిల్ విజయం'

కార్గిల్​ విజయ్​ దివస్​ సందర్భంగా దేశ సైనికుల త్యాగాలను కొనియాడారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఈ సందర్భంగా వారి వీరత్వాన్ని గుర్తుచేశారు. భారత సైనికులు దేశాన్ని కాపాడుతోన్న నిజమైన హీరోలని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

6. కార్గిల్‌ కొదమసింహం కెప్టెన్ విజయంత్ థాపర్

చారిత్రక కార్గిల్‌ యుద్ధంలో దేశ కోసం పోరాడి.. అమరులైన జవాన్లను భారతమాత గుండెల్లో దాచుకుంది. ఆ రణంలో అమరవీరులైన జవాన్లలో ఒక కెప్టెన్‌ వీరగాథను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన కథ.. సైనికుల్లోనే కాదు, పౌరుల్లోనూ స్ఫూర్తి నింపుతోంది. మానవత్వం, వీరత్వం కలగలిస్తే ఆ యువకుడిలా ఉంటుంది. తరతరాల దేశభక్తి రక్తంలో ఉరకలెత్తుతుంటే.. ఉహ తెలిసిన నాటి నుంచే సైన్యంలో చేరాలని కలలు కన్నాడు. నునూగు మీసాల వయసులోనే మాతృభూమి రక్షణలో అమరుడయ్యాడు. కార్గిల్ యుద్ధ వీరుడు.. రియల్ లైఫ్ హీరో కెప్టెన్ విజయంత్ థాపర్. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

7. ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు

తమ దేశంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని చెబుతోన్న ఉత్తర కొరియాలో తొలి కొవిడ్​ అనుమానాస్పద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు దక్షిణ కొరియా సరిహద్దు నగరం కైసోంగ్​లో పూర్తిస్థాయి లాక్​డౌన్​ విధించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

8. 'సామాజిక మాధ్యమాల వలలో చిక్కుకోవద్దు'

కొవిడ్‌ పరిణామాల నేపథ్యంలో మారిన పరిస్థితుల దృష్ట్యా 'కుటుంబ వ్యాపారాల నిర్వహణ- సవాళ్ల'పై జీఎంఆర్‌ సంస్థ అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా జీఎంఆర్‌ వరలక్ష్మి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలోని విద్య, పరిశోధన సంస్థ 'పరంపర ఫ్యామిలీ బిజినెస్‌ ఇనిస్టిట్యూట్‌' (పీఎఫ్‌బీఐ) నాలుగు వారాల ఆన్‌లైన్‌ సదస్సులు (వెబినార్‌ సిరీస్‌) నిర్వహిస్తోంది. వివిధ దేశాల నిపుణులు, వ్యాపార సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుల్లో పాల్గొంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

9. షూటింగ్​కు‌ వచ్చా... కానీ భయమే

లాక్​డౌన్​లో సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో తిరిగి సెట్​లో అడుగుపెట్టింది. అయితే తనకు ఓవైపు ఆనందం, మరోవైపు కొంచెం భయంగానూ ఉందని చెప్పింది.

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

10. స్టిక్కర్లతో కోట్లు సంపాదిస్తున్న భారత స్టార్ క్రికెటర్లు

టీమ్​ఇండియాకు చెందిన పలువురు స్టార్​ క్రికెటర్లు.. తన బ్యాట్​పై వేసుకునే స్టిక్కర్ల ద్వారానే కొన్ని కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. వీరిలో కోహ్లీ, ధోనీ, రోహిత్ తదితరులు ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.