ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @9PM - top ten news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధనా వార్తలు

ETV BHARAT TOP TEN 9PM NEWS
టాప్​టెన్ న్యూస్ @9PM
author img

By

Published : Mar 10, 2021, 9:01 PM IST

1. 26న రైతుల 'భారత్​ బంద్​'

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళనలు ఈ నెల 26తో నాలుగు నెలలు పూర్తి చేసుకుంటాయి. ఈ సందర్భంగా ఆ రోజున భారత్​ బంద్​కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. విశాఖ ఉద్యమానికి మద్దతు: కేటీఆర్‌

విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా ఏపీకి అండగా ఉంటామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. అవసరమైతే విశాఖ వెళ్లి మద్దతు తెలుపుతామని వెల్లడించారు. ఏపీ వాళ్లు కూడా తెలంగాణకు మద్దతుగా ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మోదీ ప్రైవేట్‌పరం చేసేలా ఉన్నారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. శివరాత్రికి సిద్ధం

మహాశివరాత్రి పర్వదినానికి రాష్ట్రంలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేములవాడ రాజన్న క్షేత్రంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. గెలుపే లక్ష్యంగా పార్టీల ప్రచారం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న వేళ ప్రచారం ఊపందుకుంది. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలకు మరింత పదును పెడుతున్నాయి. ఎండలను సైతం లెక్క చేయకుండా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్న నేతలు.. పట్టభద్రులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. భర్తను హత్య చేసి ఫిర్యాదు

భార్యే భర్తను హతమార్చి ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టిన ఘటన కలకలం రేపింది. పైగా ఏం ఎరగనట్టు భర్త అదృశ్యమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా...అసలు విషయం బయటపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. ఉత్తరాఖండ్​ సీఎంగా తీరథ్​ ప్రమాణం

ఉత్తరాఖండ్​ సీఎంగా భాజపా సీనియర్​ నేత, గడ్వాల్​ ఎంపీ తీరథ్​ సింగ్​ రావత్​ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, భాజపా నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ఉగ్ర కుట్ర- నలుగురు అరెస్ట్

జమ్ముకశ్మీర్​లో జైషే మహ్మద్​కు చెందిన నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. పుల్వామా తరహాలో దాడి చేసేందుకు సిద్ధం చేస్తున్న ఓ కారును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. భారత్​కు అమెరికా మంత్రి

అమెరికా రక్షణ మంత్రి లాయిడ్​ ఆస్టిన్​ తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా భారత్​కు రానున్నారు. రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, ఇతర సీనియర్​ అధికారులతో సమావేశం కానున్నారు. భారత్​తో పాటు జపాన్​, దక్షిణ కొరియాలోనూ ఆయన పర్యటిస్తారని పెంటగాన్​ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. రెండోస్థానానికి కోహ్లీసేన

అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) టీ20 టీమ్ ర్యాంకింగ్స్​తో పాటు టెస్టు ర్యాంకింగ్స్​ను బుధవారం విడుదల చేసింది. టీ20 టీమ్ ర్యాంకింగ్స్​లో టీమ్​ఇండియా రెండోస్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టు సిరీస్​లో అద్భుతంగా రాణించిన బ్యాట్స్​మన్​ రిషబ్​ పంత్​, స్పిన్నర్​ అశ్విన్​ మెరుగైన స్థానాల్లో నిలిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. ఆ జాబితాలో దీపిక

వరల్డ్​ ఎకనమిక్​ ఫోరం ప్రకటించిన యంగ్​ గ్లోబల్​ యంగ్​ లీడర్స్ జాబితాలో దీపికా పుదుకునే చోటు దక్కించుకున్నారు. 2021కి గానూ మొత్తం 112మందిని ప్రకటించగా.. వారిలో భారతీయులతో పాటు భారత సంతతికి చెందిన వారు కూడా ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.