ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9PM - telangana news today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 9PM NEWS
టాప్​టెన్​ న్యూస్​ @9PM
author img

By

Published : Jan 2, 2021, 9:00 PM IST

1. కొవాగ్జిన్ వినియోగానికి ఓకే

దేశీయ ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ రూపొందించిన 'కొవాగ్జిన్‌' టీకా అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ ఆమోద ముద్ర వేసింది. కొవాగ్జిన్‌ టీకా అత్యవసర వినియోగానికి షరతులతో కూడిన ఆమోదం తెలపాలని భారత ఔషధ నియంత్రణ సంస్థ-డీసీజీఐకి సిఫారసు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. రాష్ట్రంలో డ్రైరన్ సక్సెస్​

రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కోసం చేపట్టిన డ్రైరన్ విజయవంతంగా ముగిసింది. ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన 7 కేంద్రాల్లో రెండు గంటల పాటు డ్రైరన్ సాగింది. వివరాలను అధికారులు కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచిన అధికారులు..పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.కృత్రిమ మేధ కీలకం: కేటీఆర్

ప్రగతిభవన్‌లో ఐటీశాఖ అధికారులతో కలిసి ఏఐ సక్సెస్ రిపోర్ట్‌ను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. కృత్రిమ మేధ విభాగంలో రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వ నిర్ణయాలు చాలా ఉపయోగపడ్డాయని ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. సంక్రాంతి వేళ 4,980 బస్సులు

పండుగ వేళ ప్రయాణికులకు టీఎస్​ఆర్టీసీ తీపి కబురు వినిపించింది. ఈ నెల 8 నుంచి 14 దాకా... 4980 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రంగారెడ్డి ఆర్​ఎం స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. రామతీర్థం రగడ: కొండపైకి చంద్రబాబు

ఏపీలోని రామతీర్థం ఆలయంలో...శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రదేశాన్ని... తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరిశీలించారు. బోడికొండపైకి సహచర తెదేపా నేతలతో కలిసి... మెట్లమార్గం ద్వారా చేరుకున్నారు. గుడిపైకి చంద్రబాబు చేరుకునేసరికి ఆలయానికి తాళం వేసి ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. యాప్‌ వేధింపులు.. ఆత్మహత్య

రుణయాప్‌ల వేధింపులకు మరో నిండు ప్రాణం బలయింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు ఆత్మహత్య చేసుకోగా తాజాగా పేట్​బషీరాబాద్ పీఎస్ పరిధిలోని గుండ్లపోచంపల్లికి చెందిన చంద్రమోహన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.సైన్యం సిద్ధం

ఎలాంటి పరిస్థితుల్లోనైనా భారత సైనికులు సరిహద్దుల రక్షణలో వెనకడుగు వేయరని సీడీఎస్​ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. అరుణాచల్​ ప్రదేశ్​లో వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉన్న వైమానిక స్థావరాలను సందర్శించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

8. రిపబ్లిక్ డే రోజున '‌కిసాన్‌ పరేడ్'‌

వ్యవసాయ చట్టాల విషయంలో తమ డిమాండ్లను నెరవేర్చకపోతే గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీ వైపు ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహిస్తామని రైతులు హెచ్చరించారు. 'కిసాన్ పరేడ్' పేరుతో ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. తాలిబన్ల దాడిలో పోలీసులు మృతి

అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు మరోసారి దాడికి పాల్పడ్డారు. పోలీసులపై జరిపిన ఆకస్మిక దాడిలో ఆరుగురు పోలీసులు మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. ఐసోలేషన్‌కు ‌ఇండియా క్రికెటర్లు

ఆస్ట్రేలియా​ పర్యటనలో ఉన్న టీమ్​ఇండియా క్రికెటర్లు రోహిత్‌ శర్మ, రిషభ్ పంత్‌, శుభ్‌మన్‌ గిల్‌, పృథ్వీషా, నవదీప్‌ సైనీని ఐసోలేషన్​కు పంపించారు. ​నూతన సంవత్సరం సందర్భగా వీరు బయటకు వెళ్లి ఓ హోటల్​లో భోజనం చేయడమే ఇందుకు కారణం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.