1. నేటి నుంచి విద్యాసంస్థలు బంద్
పాఠశాలలు ప్రారంభమై 2నెలలైనా గడవకముందే మళ్లీ మూతపడ్డాయి. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి విద్యాలయాలు మూతపడనున్నాయి. కరోనా కల్లోలం కలవరపెడతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. నేడూ కొనసాగనున్న చర్చ
శాసనసభలో నేడు కూడా పద్దులపై చర్చ జరగనుంది. ఇవాళ విద్యాశాఖ, వైద్యారోగ్యం సహా వివిధ శాఖల పద్దులపై చర్చ చేపట్టనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. అభ్యర్థిపై సమాలోచనలు
నాగార్జునసాగర్ ఉపపోరు అభ్యర్థి ఖరారుపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. నామినేషన్ల దాఖలుకు మరో వారం గడువే ఉండటంతో అభ్యర్థిని ఒకట్రెండు రోజుల్లో ప్రకటించాలని యోచిస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై అభ్యర్థి ఎంపికపై చర్చించినట్లు తెలిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. తెలంగాణ 7వ స్థానం
ఎఫ్‌డీఐల ఆకర్షణలో దేశంలో తెలంగాణ 7, 14వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. దేశంలో అత్యధిక మొత్తం ఎఫ్‌డీఐలు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ, తమిళనాడు, హరియాణాలకు వెళ్లాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'ప్రత్యేక హోదా కుదరదు'
ఏపీ ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఆ స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. కామ్రేడ్ల నోట శబరిమల మాట
కేరళలో లోక్‌సభ ఎన్నికల్లో వామపక్ష కూటమి దారుణంగా ఓడిపోయింది. దీనికి ప్రధాన కారణం అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించిన శబరిమల వివాదం. 2019లో జరిగిన శబరిమల వివాదం ఈసారి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పెద్దగా పైకి విన్పించట్లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. భారత్‌కు 40వ ర్యాంకు
అంతర్జాతీయ మేధోసంపత్తి సూచీలో భారత్ 40వ ర్యాంకు సాధించింది. అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలిసీ సెంటర్(జీఐపీసీ) ఈ ర్యాంకులను విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. కమ్మేసిన ఇసుక తుపాను
ఆఫ్రికా దేశం లిబియాను ఇసుక తుపానులు వణికిస్తున్నాయి. తాజాగా దక్షిణ ప్రాంతాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంది. బలమైన గాలులు వీయడం వల్ల నగరాలు, పట్టణాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దుకాణాలు మూసివేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ధావన్ అలా.. మోర్గాన్ ఇలా
ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం తనకు తెలుసని అన్నాడు ధావన్. భారత్‌తో తొలి వన్డేలో ఓటమిపై తమ ఆటగాళ్ల తప్పేం లేదని చెప్పాడు ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ మోర్గాన్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. నాగబాబు బాలీవుడ్ ఎంట్రీ!
మెగా బ్రదర్ నాగబాబు బాలీవుడ్లో అడుగుపెట్టనున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 'ఛత్రపతి' హిందీ రీమేక్‌లో ఈయన ప్రతినాయకుడిగా ఎంపికయ్యారని సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.