1. నేటి నుంచి మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌లు
కరోనా నిర్ధరణ పరీక్షలను రాష్ట్రప్రభుత్వం మరింత విస్తరించింది. ప్రస్తుతం టెస్టుల కోసం ఆస్పత్రులకు వెళ్లాల్సి ఉండగా. ఇక నుంచి ప్రజల చెంతకే కొవిడ్ నిర్ధరణ పరీక్షల కేంద్రం తరలిరానుంది. కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్నగ్రేటర్ పరిధిలో కంటెయిన్‌మెంట్ ప్రాంతాల్లో తొలుత వీటిని వినియోగిస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. కొత్తగా ఆరు లెదర్ పార్కులు
రాష్ట్రంలో లెదర్ ఉత్పత్తుల పరిశ్రమలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు జిల్లాల్లో చిన్న తరహా పార్కుల ఏర్పాటు కోసం..164 ఎకరాల భూమిని కేటాయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. విద్యావిధానంతో అధిక ప్రభావం
జాతీయ నూతన విద్యావిధానంతో తెలుగు రాష్ట్రాలపై అధిక ప్రభావం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. పన్నెండో తరగతి వరకు పాఠశాల విద్యలోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో ఇప్పటివరకు తెలుగురాష్ట్రాల్లో ఉన్నతవిద్య పరిధిలో ఉన్న ఇంటర్మీడియట్ బోర్డులు పాఠశాల విద్య కిందికి రానున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. అయోధ్య భూమిపూజకు ముస్తాబు
రామ మందిర భూమిపూజ కోసం అయోధ్య నగరం సిద్ధమవుతోంది. ఆగస్టు 5న జరగనున్న కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. శంకుస్థాపన కార్యక్రమం 32 సెకన్ల పాటు జరగనుంది. దీన్ని దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. వరదలు: బిహార్‌లో బీభత్సం
భారీ వర్షాలు, వరదలతో కొద్ది రోజులుగా అతలాకుతలమైన అసోంలో పరిస్థితులు కాస్త మెరుగుపడుతున్నాయి. వరద ప్రభావం తగ్గుముఖం పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. బిహార్‌లో మాత్రం వరద బీభత్సం కొనసాగుతోంది. 38 లక్షల మందికిపైగా ప్రభావితమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. సెప్టెంబర్ 30 వరకు గడువు
కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి ... ఆదాయపు పన్ను రిటర్నులను సమర్పించే గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. నేటి నుంచే ఇంగ్లాండ్-ఐర్లాండ్ వన్డే సిరీస్
నేటి నుంచి ఐసీసీ సూపర్ లీగ్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఇంగ్లాండ్-ఐర్లాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ నేడు మొదలవనుంది. సాయంత్రం 6.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. నేడు రోదసిలోకి నాసా పర్సీవరెన్స్ రోవర్
ఆధునిక విజ్ఞానంతో మరో మెట్టు ఎక్కేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనాసంస్థ-నాసా సిద్ధమైంది. మానవ మేథస్సుతో ఇప్పటి వరకు భూమిపైనే జీవజాలాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు.. త్వరలో అంగారక గ్రహంపై శోధించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. మారిషస్ సుప్రీం కోర్టు భవనం ప్రారంభించనున్న మోదీ
మారిషస్‌లోని సుప్రీం కోర్టు నూతన భవనాన్ని ఆ దేశ ప్రధాని ప్రవీంద్ జగ్‌నాథ్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమంలో ఇరు దేశాల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. సినిమాల్లో నటుడు.. ప్రజలకు ఆపద్బాంధవుడు
కొన్నిరోజుల క్రితం వరకు అతి సాధారణంగా కనిపించిన నటుడు సోనూసూద్.. ప్రస్తుతం చాలామందికి ఆపద్బాంధవుడిగా మారాడు. నేడు అతడు 47వ పుట్టిరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోనూసూద్ గురించి ప్రత్యేక కథనం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.