1. 'తెరాస చేసింది శూన్యం'
నాగార్జునసాగర్ నియోజకవర్గానికి తెరాస చేసింది శూన్యమని పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఉపపోరులో భాజపాకు ధరావత్ కూడా దక్కదన్నారు. నల్గొండ జిల్లా హాలియాలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన సభలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 'తీర్మానం చేసి ఖర్చు చేసుకోవచ్చు'
గ్రామపంచాయతీల నిధులను పై అధికారుల అనుమతులు లేకుండానే, ఆయా గ్రామప్రజలు, పంచాయతీల తీర్మానం మేరకు ఖర్చు చేసుకునే వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. పోస్టులో ప్రసాదం
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల ప్రసాదాలు ఇకపై భక్తుల ఇళ్ల వద్దకే రానున్నాయి. మనకు నచ్చిన గుడిలో ప్రసాదాల కోసం దగ్గరలోని ఏ పోస్టాఫీసుకైనా వెళ్లి రుసుం చెల్లిస్తే చాలు.. రెండు, మూడు రోజుల్లో హోం డెలివరీ చేస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఆ కోర్టులు రద్దు
రాష్ట్రంలోని ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టులను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఏప్రిల్ 1 నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. తొలి దశలో 80% పోలింగ్
బంగాల్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. 190 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు. సాయంత్రం 6 గంటల వరకు 79.79 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. 'ఆ పార్టీల్లో గందరగోళం'
కాంగ్రెస్, సీపీఎంలు రెండూ సిద్ధాంతపరంగా గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఎద్దేవా చేశారు. కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు ప్రతిపక్షాలను విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. 'సహజీవనం చేస్తే శిక్షలా?'
సహజీవనంలో ఉంటూ పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొన్న యుక్తవయసులోని యువకునిపై పోక్సో చట్టం కింద శిక్ష విధించడంపై స్పందించాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. బంగ్లా ప్రధానితో మోదీ
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తర్వాత విదేశీ పర్యటనకు ప్రధాని వెళ్లటం ఇదే తొలిసారి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ఫైనల్స్‌కు పురుషుల జోడీ
ఓర్లీన్ మాస్టర్స్‌లో భారత పురుషుల డబుల్స్ జోడీ క్రిష్ణ ప్రసాద్-విష్ణు వర్ధన్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీస్‌లో ఇంగ్లాండ్ జంటపై విజయం సాధించింది భారత ద్వయం. మరోవైపు సెమీస్‌లో ఓటమి పాలైన మహిళల జోడీ ఇంటి ముఖం పట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. రణ్‌బీర్, షారుక్ అప్డేట్స్!
తమిళ దర్శకుడు అట్లీ-హీరో షారుక్ ఖాన్ కాంబోలో రానున్న సినిమా షూటింగ్ ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానుందని సమాచారం. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'యానిమల్' అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.