1. లాసెట్ ఫలితాలు విడుదల
రాష్ట్ర లాసెట్, పీజీఎల్ సెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. మూడేళ్ల లాసెట్‌లో 78.60 శాతం ఉత్తీర్ణులు కాగా.. ఐదేళ్ల లాసెట్‌లో 62.35 శాతం, పీజీఎల్ సెట్‌లో 91.04 శాతం ఉత్తీర్ణత నమోదయినట్లు ఆయన వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. అప్పుల పాలవుతున్న యూత్
క్రికెట్ బెట్టింగ్ వ్యసనంలా మారుతోంది. యువత క్రమంగా బెట్టింగ్ వైపు ఆకర్షితులవుతున్నారు. ఐపీఎల్ సీజన్లో బంతి బంతికి పందెం కాస్తూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. బెట్టింగ్ నిర్వాహకులు.. యాప్‌ల సాయంతో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. అప్పులు కూడా ఇస్తూ.. యువతను అప్పులపాలు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. అంతిమయాత్రలో ఎంపీ
భాజపా కార్యకర్త గంగుల శ్రీనివాస్ అంతిమ యాత్రలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, డీకే అరుణ, మాజీ ఎంపీ వివేక్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఏనుగుల గుంపు హల్చల్
అసోంలో జనావాస ప్రాంతాల్లోకి వచ్చి ఏనుగులు హల్చల్ చేశాయి. వీటిని దూరంగా వెళ్లగొట్టేందుకు ప్రయత్నించిన వారిపై దాడికి ప్రయత్నించాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'బంగాల్ వైభవానికి విఘాతం'
బుజ్జగింపు రాజకీయాలు బంగాల్ ఆధాత్మిక వైభవాన్ని దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ మేరకు పరోక్ష విమర్శలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. 'రాముడి జీవితం నుంచి నేర్చుకోవాలి'
రాముడి జీవితం చాలా మందికి ఆదర్శప్రాయమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. 'థవాస్మి' పుస్తకావిష్కరణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. భారీగా పెరిగిన బంగారం
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా మూడోరోజు భారీగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.791 పెరిగింది. వెండి కిలోకు రూ.2,147 వృద్ధి చెందింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. అధ్యక్ష ఫలితం ఇవాళేనా?
అగ్రరాజ్యం అమెరికా అద్యక్ష పీఠం ఎవరిదన్న దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే దీనిపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఐదు కీలక రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతున్న సమయంలో.. ట్రంప్ ఆధిక్యంలో ఉన్న జార్జియాలో బైడెన్ రేసులోకి వచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ఆరెంజ్, పర్పుల్ క్యాప్
ఐపీఎల్ ముగింపు దశకు వచ్చింది. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ కూడా మెల్లమెల్లగా చేతులు మారుతోంది. ఇప్పటికే పర్పుల్ క్యాప్‌ను రబాడ నుంచి బుమ్రా లాగేసుకోగా.. ఆరెంజ్ మాత్రం రాహుల్ వద్దే ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. నడుము సీన్ నిజం కాదని తెలుసా?
'ఖుషీ' సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే నడుము సన్నివేశానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఆ సీన్ వెనకున్న నిజం తెలిస్తే మాత్రం కచ్చితంగా ఆశ్చర్యపడతారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.