1. రేపు కేసీఆర్ పర్యటన
రేపు సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కాల్వకు నీటి విడుదల చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ఆ గృహంలో 45 మందికి కరోనా
హైదరాబాద్ ఎల్బీనగర్లోని అనాథ వసతి గృహంలో కరోనా కలకలం రేపింది. 45 మంది విద్యార్థులు వైరస్ బారినపడ్డారు. 68 మందికి పరీక్షలు నిర్వహించగా.. 45 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 'ఆయన సేవలు ఎనలేనివి '
కులరహిత సమాజం కోసం బాబు జగ్జీవన్ రామ్ ఎంతో పాటుపడ్డారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని నిజాం కళాశాల వద్ద ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. లాక్డౌన్ నకిలీ ఉత్తర్వులు, అరెస్టు
తెలంగాణలో మరోసారి లాక్డౌన్ అంటూ నకిలీ ఉత్తర్వులు సృష్టించిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గతంలో ఇచ్చిన జీవోను డౌన్లోడ్ చేసుకుని తేదీలు మార్చి పాత జీవోను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసినట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. నక్సలైట్ల చెరలో జవాను
బీజాపుర్ ఎన్కౌంటర్ సమయంలో కోబ్రా దళానికి చెందిన ఓ జవానును ఎత్తుకెళ్లామన్న నక్సలైట్ల ప్రకటనలో నిజానిజాలు తేల్చేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. విద్యార్థుల విధ్వంసం
బిహార్‌లోని సాసారంలో విద్యార్థులు, మరికొందరు ప్రజలు విధ్వంసకాండకు పాల్పడ్డారు. కరోనా నిబంధనల అమల్లో భాగంగా ఓ కోచింగ్ సెంటర్‌ను అధికారులు మూయించడమే ఇందుకు కారణం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. కార్చిచ్చు- రంగంలోకి వాయుసేన
ఉత్తరాఖండ్‌లోని అటవీ ప్రాంతాల్లో చెలరేగిన కార్చిచ్చును అదుపు చేేసేందుకు హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు అధికారులు. సమీపంలోని సరస్సుల నుంచి నీటిని సేకరించి మంటలు వ్యాపించిన ప్రాంతాల్లో చల్లుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. మార్కెట్ నష్టాలకు కారణాలివే!
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఒక్క రోజులో లక్ష దాటాయి. ఈ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. దీనితో సూచీలు రికార్డు స్థాయి నష్టాల్లో ట్రేడవుతున్నాయి. భారీ నష్టాలకు నిపుణులు చెబుతున్న కారణాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. బీసీసీఐ అవినీతి నిరోధక చీఫ్‌గా మాజీ డీజీపీ
బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం(ఏసీయూ) చీఫ్‌గా షబీర్ హుస్సేన్ శెఖాడం ఖాండ్వావాలా నియమితులయ్యారు. ఈయన 1973 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2010 డిసెంబర్లో డీజీపీగా పదవీ విరమణ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. 'సినీ కార్మికులకు ఉచితంగా కరోనా టీకా'
కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా సినీ కార్మికులకు ఉచితంగా కరోనా టీకా అందించే దిశగా ప్రయత్నాలు చేస్తామని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్' ప్రెస్మీట్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.