ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 3PM NEWS
టాప్​టెన్ న్యూస్ @3PM
author img

By

Published : Mar 12, 2021, 2:57 PM IST

1. 'వారితో తెరాసది పేగుబంధం'

ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడుతోన్న ప్రభుత్వం తెరాస అని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులతో తమది పేగుబంధమని పునరుద్ఘాటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 'పీఆర్సీ ఎలా ఇస్తుంది?'

జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం పీఆర్సీ ఎలా ఇస్తుందని ప్రభుత్వాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఎందుకు చెల్లించడం లేదని అడిగారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. మద్యం షాపు​లో మంటలు

సికింద్రాబాద్​ పరిధిలోని బొల్లారంలోని ఓ వైన్స్​లో అగ్నిప్రమాదం జరిగింది. సుమారు రూ.10 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లు పగిలి, చెల్లాచెదురుగా పడిపోయాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. పార్టీల ర్యాలీలు

మరికొద్ది గంటల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెరపడనుండటంతో అభ్యర్థులు జోరుపెంచారు. ఖమ్మంలో పలు పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. తమకే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. వారి స్ఫూర్తిని కొనసాగిస్తాం: మోదీ

స్వాతంత్య్ర ఉద్యమంలో అనేక పోరాటాలు, అనేక బలిదానాలను మరోసారి గుర్తుకుతెచ్చుకొని దేశం మొత్తం పునరుత్తేజం అవుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ వేడుకల్లో భాగంగా గుజరాత్​లోని సబర్మతీ ఆశ్రమం నుంచి దండి యాత్రను ప్రధాన మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'కోయంబత్తూర్​ సౌత్' నుంచి​ కమల్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది మక్కల్ నీది మయ్యం(ఎంఎన్​ఎం). ఆ పార్టీ అధ్యక్షుడు కమల్​ హాసన్​ కోయంబత్తూర్​ సౌత్ నియోజకవర్గం​ నుంచి బరిలోకి దిగనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'మమతకు గాయం కుట్రే'

నందిగ్రామ్​లో మమత కాలికి గాయమైన ఘటన గురించి కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీఎంసీకి చెందిన ఆరుగురు ఎంపీల బృందం కలిసింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. నందిగ్రామ్​లో సువేందు

బంగాల్​ శాసన సభ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేయనున్న సువేందు అధికారి నామినేషన్​ దాఖలు చేశారు. ఇటీవలే తృణమూల్​ను వీడి భాజపాలో చేరిన సువేందు స్థానిక నేత కాగా.. సీఎం మమతా బెనర్జీ సైతం పోటీకి ఈ నియోజకవర్గాన్నే ఎంచుకోవడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. తొలి టీ20లోనే సూర్య!

యువ క్రికెటర్​ సూర్యకుమార్ యాదవ్​ నేడు ఇంగ్లాండ్​తో జరిగే తొలి టీ20లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇది అధికారిక ప్రకటన కానప్పటికీ.. సాహిల్‌ఖాన్‌ అనే ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ఇన్​స్టాలో పెట్టిన ఓ పోస్టు ద్వారా ఈ విషయం అర్థమవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. కార్తికేయతో సుకుమార్ చిత్రం

టాలీవుడ్ యువ నటుడు కార్తికేయతో ఓ సినిమాను నిర్మించబోతున్నాడు సుకుమార్. ఈ చిత్రానికి కథ, స్క్రీన్​ప్లే, డైలాగ్స్​ కూడా అందించనున్నాడీ దర్శకుడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.