ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 3PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 3PM NEWS
టాప్​టెన్ న్యూస్ @ 3PM
author img

By

Published : Feb 28, 2021, 2:53 PM IST

1. 'హైద‌రాబాద్‌లో ఐపీఎల్ నిర్వ‌హించండి'

హైదరాబాద్​ వేదికగా ఐపీఎల్​ సీజన్​ను నిర్వహించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. కత్తుల కోసం వేట

న్యాయవాద దంపతుల హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు తలమునకలయ్యారు. నిందితులు వాడిన కత్తులను వెలికితీసేందుకు ఆంధ్రప్రదేశ్​లోని విశాఖకు చెందిన గత ఈతగాళ్లను పోలీసులు రంగంలోకి దింపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. రైతుపై మోదీ ప్రశంసలు

మన్​కీ బాత్​లో ప్రధాని మోదీ... హైదరాబాద్​కు చెందిన అభ్యుదయ రైతును ప్రశంసించారు. వ్యవసాయంలో ఆయన చేస్తున్న కృషిని అభినందించారు. శాస్త్ర విజ్ఞానం అంటే కేవలం భౌతిక, రసాయన శాస్త్రాలకు సంబంధించిన అంశం కాదన్న ప్రధాని.... ప్రయోగశాల నుంచి క్షేత్రస్థాయికి దానిని విస్తృతపర్చాలని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 'ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది'

అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ పడలేక ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. కాంగ్రెస్​ పతనం: షా

వారసత్వ రాజకీయాల కారణంగానే దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ పార్టీ పతనమవుతోందని విమర్శించారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. పుదుచ్చేరి నుంచి రూ.15వేల కోట్ల అవినీతి సొమ్మును గాంధీ కుటుంబానికి తరలించిందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. కాంగ్రెస్​లో జీ23 గుబులు

సమస్యల ఊబిలో చిక్కుకున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారిపోతోంది. నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ లేఖలు రాసిన 23 మంది.. తాజాగా ప్రత్యేక సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. మంచుకొండకు పగుళ్లు

అంటార్కిటికాలోని బ్రంట్​ ఐస్​ షెల్ఫ్​ నుంచి భారీ మంచు ముక్క విడిపోయింది. ఆ మంచు భాగం బ్రిటన్​లోని బెడ్​ఫోర్డ్​షైర్​ పట్టణమంత ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక భారీ స్థాయి మంచు ఫలకం నుంచి ఓ పెద్ద మంచు ముక్క విడిపోవడాన్ని కాల్విన్​ అంటారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. సోమవారం పసిడి బాండ్ల ఇష్యూ

సిరీస్ 12 సార్వభౌమ పసిడి బాండ్లు సోమవారం (మార్చి 1) నుంచి ఇష్యూకు రానున్నాయి. మార్చి 5 వరకు సబ్​స్క్రిప్షన్​కు అందుబాటులో ఉంటాయి. ఈ సిరీస్​లో గ్రాము పసిడి బాండ్​ ధర ఎంత? సెటిల్​మెంట్ తేదీ ఎప్పుడు అనే వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. షాట్​గన్​ కోచ్​కు కరోనా

ఐఎస్​ఎస్​ఎఫ్​ షూటింగ్​ ప్రపంచకప్​లో పాల్గొనేందుకు ఈజిప్టు వెళ్లిన భారత షాట్​గన్​ కోచ్​కు కరోనా సోకినట్లు తేలింది. ఆ కోచ్​ ప్రస్తుతం ఐసోలేషన్​కు పంపినట్లు జాతీయ రైఫిల్​ సంఘం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. పవన్​-క్రిష్​ సినిమా

క్రిష్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పవన్​కళ్యాణ్​ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. కాగా, ఈ చిత్రం టైటిల్​, ఫస్ట్​లుక్​ను శివరాత్రి కానుకగా రిలీజ్​ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.