1. మీడియాకు మార్గదర్శకాలు
ఓటీటీ, డిజిటల్ మీడియాకు కేంద్రం మార్గదర్శకాలు తీసుకొచ్చింది. చట్టవిరుద్ధమైన, తప్పుడు సమాచారాన్ని నియంత్రించేందుకు ఈమేరకు కఠిన చర్యలు చేపట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 'కొండగట్టు అభివృద్ధికి కృషి చేస్తాం'
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్నను ఎమ్మెల్సీ కవిత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ దర్శించుకున్నారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 'దుష్ప్రచారం చేయొద్దు'
సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయొద్దని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు క్రమశిక్షణతో వ్యవహరించాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కోర్టును ప్రారంభించిన హిమాకోహ్లీ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 8వ అదనపు జిల్లా కోర్టును డిజిటల్ విధానంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ ప్రారంభించారు. ప్రజల సౌకర్యార్థం న్యాయవ్యవస్థ పనిచేస్తుందని డిస్ట్రిక్ట్ అడిషనల్ సివిల్ జడ్జి నందికొండ నర్సింగ్ రావు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. పుదుచ్చేరి కొత్త ఎల్జీ!
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఐపీఎస్ అధికారి భీమ్ సైన్ బస్సీని నియమించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి సైతం ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. రాష్ట్రపతికి లేఖ
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న క్రమంలో అరెస్టైన రైతుల్ని వెంటనే విడుదల చేయాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సంయుక్త కిసాన్ మోర్చా లేఖ రాసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. భారత్-పాక్ కీలక నిర్ణయం
నియంత్రణ రేఖ వద్ద శాంతి స్థాపనే లక్ష్యంగా భారత్, పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. గురువారం అర్ధరాత్రి నుంచి కాల్పుల విరమణ ఒప్పందాలకు తూచా తప్పకుండా కట్టుబడి ఉండాలని తీర్మానించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. చైనా దుష్ప్రచారంపై బిల్లు
వివిధ అంశాల్లో చైనా చేస్తున్న తప్పుడు ప్రచారంపై అమెరికా చట్టసభలో రిపబ్లికన్ నేతలు కీలక బిల్లును ప్రతిపాదించారు. చైనా సహకారంతో ఈ తరహా కార్యకలాపాలు జరుపుతున్న సంస్థలకు చెక్ పెట్టేలా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. లైవ్ కోసం ఐసీసీ భారీ డీల్
ఐసీసీ, ఐఎంజీ మధ్య భారీ ఒప్పందం కుదిరింది. మూడు ఐసీసీ ప్రపంచకప్ టోర్నీల్లో 541 మ్యాచ్‌లను ప్రసారం చేసే అవకాశాన్ని దక్కించుకుంది ఐఎంజీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. అజిత్ సైక్లింగ్, ఫారెస్ట్‌లో చిరు
తమిళ స్టార్ హీరో అజిత్.. సైకిల్‌పై లాంగ్రైడ్కు వెళ్తూ దర్శనమిచ్చారు. ఎక్కడికి వెళ్తున్నారో వివరాలు తెలియలేదు. అలాగే 'ఆచార్య' షూటింగ్లో భాగంగా చిరంజీవి-రామ్‌చరణ్ కలిసి ఒకేసారి చిత్రీకరణలో పాల్గొన్నారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.