ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 11AM NEWS
టాప్​ టెన్​ న్యూస్​ @11AM
author img

By

Published : Mar 24, 2021, 10:57 AM IST

1. దేశంలో కొత్తగా 47 వేల మందికి వైరస్

భారత్​లో వైరస్​ ఉద్ధృతి మళ్లీ పెరుగుతోంది. కొత్తగా 47,262 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 275 మంది కొవిడ్​తో మరణించారు. 23 వేల మందికిపైగా వైరస్​ను జయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. రాష్ట్రంలో మరో 431 కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా 431 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,04,298కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. ఫ్రీడం రన్​ ప్రారంభం

అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా హైదరాబాద్​లో తెలంగాణ స్పోర్ట్స్ ఆథారిటీ ఆధ్వర్యంలో ఫ్రీడం రన్​ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఎల్బీ స్టేడియం వరకు 3కె రన్​ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. ఆ పరీక్షలుంటాయా ఉత్కంఠ

పదో తరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షలు జరుగుతాయా? రాష్ట్రంలో విద్యాసంస్థలన్నింటినీ బుధవారం నుంచి మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో లక్షలాదిమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న ఇది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. షటిల్ ఆడుతూ సీఐ మృతి

షటిల్​ ఆడుతుండగా గుండెపోటుతో ఓ పోలీసు అధికారి ప్రాణాలొదిలారు. గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కోర్టులోనే కుప్పకూలిపోయారు. సహచరులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. ఆ లేడీకి ప్రధాని ప్రశంస

వ్యవసాయ క్షేత్రంలోకి దిగి, స్వయం కృషితో ఉత్తమ రైతులుగా ఎదిగిన మహిళామణులు ఎందరో. అలాంటి ఓ మహిళే బిహార్‌కు చెందిన వీణాదేవి. మంచం కిందే పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించిన వీణాదేవి.. 'మష్రూమ్ లేడీ'గా గుర్తింపు తెచ్చుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'భారత్​-చైనా విభేదాలు'

భారత్,​ చైనాల మధ్య ఎన్నడూ లేనంతగా విభేదాలు తలెత్తాయని అమెరికా అడ్మిరల్​ జాన్​ సీ అక్విలినో తెలిపారు. సరిహద్దుల్లో చైనా దుశ్చర్యలు, ఇండో-పసిఫిక్​ ప్రాంతంలో దురాక్రమణలు.. డ్రాగన్​ను భారత్​ నమ్మకుండా చేశాయని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఆ షేర్లు కుదేలు

స్టాక్​మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 302 పాయింట్లు కోల్పోయి 49,748 వద్ద ట్రేడింగ్​ సాగిస్తోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 90 పాయింట్లు క్షీణించి 14,724 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ముంబయికి సీఎస్​కే

ఐపీఎల్​ ప్రాక్టీసు క్యాంప్​ను ముంబయికి మార్చినట్లు చెన్నై జట్టు సీఈఓ వెల్లడించారు. ఈనెల 26న అక్కడికి వెళ్లనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. టీకా తీసుకున్న​ సంజయ్​ దత్​

విలక్షణ నటుడు సంజయ్​ దత్​ కొవిడ్​ టీకా తీసుకున్నారు. ముంబయిలోని బీకేసీ వాక్సిన్​ సెంటర్​లో తొలిడోసు వేయించుకున్నట్లు సంజూ ట్విట్టర్​లో తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.