1. దేశంలో 45,903 మందికి కరోనా
భారత్‌లో తాజాగా 45,903 కేసులు నమోదయ్యాయి. మరో 490 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 85 లక్షల 53 వేలు దాటింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. రాష్ట్రంలో 857 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 857 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇప్పటి వరకు 2,51,188 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతిచెందిన వారి సంఖ్య 1,381కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. వీరజవాన్ మృతిపై నేతల సంతాపం
వీరమరణం పొందిన రాడ్యా మహేశ్‌కు మంత్రులు కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి, సభాపతి పోచారం, ఎమ్మెల్సీ కవిత నివాళి అర్పించారు. మహేశ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. మేనిఫెస్టోకు కమిటీ ఏర్పాటు
జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో కమిటీని కాంగ్రెస్ ప్రకటించింది. జీహెచ్ఎంసీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా మర్రి శశిధర్‌రెడ్డి, కన్వీనర్‌గా దాసోజు శ్రవణ్‌కుమార్ వ్యవహరించనున్నారు. వీరితో పాటు మరో 8 మంది సభ్యులకు కమిటీలో చోటు కల్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఏడుగురు మృతి
దేశంలో వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో 11మంది మరణించారు. మధ్యప్రదేశ్‌లో ట్రక్కు, కారు ఢీ కొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. నేర చరితుల భవితవ్యం రేపే
బిహార్ ఎన్నికల్లో పోటీ చేసిన 1,157 మంది అభ్యర్థులకు నేర చరిత్ర ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఈసీ నోటీసులు జారీ చేయగా.. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల నేరచరిత్ర వివరాలను బహిర్గతం చేశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. భారీ లాభాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 534 పాయింట్ల బలపడి 42,447 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 186 పాయింట్లు పెరిగి 12,450 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. ఈటా తుపాను బీభత్సం
మధ్య అమెరికా, మెక్సికోలో బీభత్సం సృష్టించిన ఈటా తుపాను.. క్యూబా, దక్షిణ ఫ్లోరిడాపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ తుపాను ధాటికి పదుల సంఖ్యలో మరణించగా.. 100 మందికిపైగా గల్లంతయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. గాయం గురించి సెలక్టర్లకు తెలియదా?
యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం గురించి బీసీసీఐ సెలక్టర్లకు తెలియదని, అందుకే అతడిని ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నవంబరు 27 నుంచి భారత్-ఆసీస్ జట్ల మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. ఆ ఆలోచనలే వచ్చాయి: తమన్నా
కొవిడ్ బారిన చికిత్స పొందుతున్నప్పుడు చావు ఆలోచనలు ఎక్కువగా వచ్చాయని నటి తమన్నా చెప్పింది. కానీ అప్పుడు వైద్యులే బతికించారని, తల్లిదండ్రులు అండగా నిలిచారని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.