1. రాష్ట్రంలో మరో 1,486 కరోనా కేసులు
రాష్ట్రంలో మరో 14 వందల 86 కరోనా కేసులు, 7 మరణాలు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు కొవిడ్ కేసుల సంఖ్య 2 లక్షల 24 వేల 545కు చేరగా.. 12 వందల 82 మంది మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. భారీ వర్షాల ఎఫెక్ట్: పాతబస్తీ ఆగమాగం
భారీ వర్షాలు హైదరాబాద్‌ను కనీవినీ ఎరుగని రీతిలో బాధలకు గురిచేశాయి. చెరువు కట్టలు తెగిపోవడంతో పాతబస్తీలో పలు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉండగా.. కొన్ని ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. వాహనాలు, ఇంటి సామాన్లు అన్నీ కొట్టుకుపోయి బురద మాత్రం మిగిలిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.5 కోట్ల డివిడెండ్
2019-2020 ఏడాదికి సంబంధించి తెలంగాణ గిడ్డంగుల సంస్థ లాభాల నుంచి రూ.5 కోట్ల డివిడెండ్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ఛైర్మన్ సామేలు ఆధ్వర్యంలోని అధికారుల బృందం మంత్రి నిరంజన్ రెడ్డికి చెక్కును అందజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. అసెంబ్లీలోనే నిద్రించి ఎమ్మెల్యేల నిరసన
పంజాబ్ ప్రభుత్వం... వ్యవసాయ కొత్త చట్టం ముసాయిదా కాపీలను ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిపక్ష ఆమ్‌ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు. రాత్రి శాసనసభ భవనంలో ఉండి నిరసన తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. దేశంలో భారీగా తగ్గిన కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 46,791 కేసులు నమోదయ్యాయి. మరో 587మంది కరోనా ధాటికి ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. అర్జెంటీనాలో 10లక్షలు దాటిన కేసులు
ప్రపంచంలో కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అర్జెంటీనాలో మొత్తం బాధితుల సంఖ్య 10 లక్షలు దాటింది. మరోవైపు అమెరికా, బ్రెజిల్, రష్యా సహా పలు దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. బొగ్గుగనిలో ప్రమాదం
ఉత్తర చైనాలోని బొగ్గుగనిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. ఒకరికి గాయలైనట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. లాభాల్లో మార్కెట్లు
స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇటీవల నమోదైన భారీ లాభాల నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బీఎస్ఈ-సెన్సెక్స్ 150 పాయింట్లకుపైగా లాభంతో 40,589 వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. లీగ్‌కు సిద్ధమైన మలింగ
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వ్యక్తిగత కారణాలతో వైదొలగిన శ్రీలంక పేసర్ లసిత్ మలింగ.. స్వదేశంలో జరగనున్న లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడబోతున్నాడు. ఇతడితో పాటు డుప్లెసిస్, రసెల్, షాహిద్ అఫ్రిదిలు ఈ టోర్నీలో భాగం కానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. ఆ డాక్టర్ స్టెప్పులకు హృతిక్ ఫిదా
అసోంకు చెందిన డాక్టర్ అరుప్ సేనాపతి.. పీపీఈ కిట్ ధరించి చేసిన డాన్స్ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ వీడియోకు ఫిదా అయిన హృతిక్ రోషన్.. వైద్యుడు వేసిన స్టెప్పులను నేర్చుకోవాలనుకుంటున్నట్లు రీట్వీట్ చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.