1. కొత్తగా 78,512 కేసులు
దేశంలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. తాజాగా 78,512 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో 971 మంది మహమ్మారి కారణంగా చనిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. మరో 1,873 కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో జరిపిన పరీక్షల్లో తాజాగా 1873 మందికి పాజిటివ్‌గా నిర్థరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 1,24,963కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఎంఎంఆర్ రేటులో తగ్గుదల
కేసీఆర్ కిట్లు, ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలకు ప్రోత్సాహకంతో పాటు... 102, ఇతర ప్రభుత్వ చర్యల ద్వారా రాష్ట్రంలో బాలింత మరణాల రేటు గణనీయంగా తగ్గిందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఇద్దరి దుర్మరణం
రాంపూర్ బైపాస్ రోడ్డు వద్ద... రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు బయటకు తీసి... నిమ్స్ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. జాగ్రత్తల మధ్య ఈసెట్ పరీక్ష
ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ఈసెట్ పరీక్ష జరుగుతోంది. థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే విద్యార్థులను లోనికి అనుమతించారు. భౌతికదూరం పాటిస్తూ... మాస్కులు, గ్లౌజులతో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. కోటి 7 లక్షలు స్వాధీనం
నిర్దిష్ట సమాచారం మేరకు వరంగల్‌లోని ఓ పండ్ల వ్యాపారి ఇంట్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో... సుమారు కోటి 7 లక్షలు రూపాయాలు బయటపడ్డాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. పోలీసుపై గేదె దాడి
క్రూరమృగాలకే కాదు సాధు జంతువులకు కూడా.. అప్పుడప్పుడు కోపం వస్తుంటుంది. అలాంటి ఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లో జరిగింది. రోడ్డు మీద నిల్చొని ఉన్న ఓ గేదె అటు వైపుగా ఓ వాహనంపై వస్తున్న.. ఓ పోలీసుపై ఆకస్మాత్తుగా దాడి చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. చట్టాలకు వక్రభాష్యాలు
పల్లెల్లో పేదరికాన్ని పారదోలడానికి ఉద్దేశించిన గ్రామీణ ఉపాధి హామీ చట్ట నిబంధనలను ఇప్పటికీ సక్రమంగా పాటించకపోవడం పెద్ద సమస్య. ఈ చట్టంలోని 3(1) సెక్షన్ ప్రకారం శారీరక శ్రమ తప్ప.. ఎటువంటి నైపుణ్యాలూ అవసరం లేని పనులను చేయడానికి ముందుకొచ్చే వయోజనులకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో '100 రోజులకు తగ్గకుండా' పని కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతోంది. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ - సెన్సెక్స్ 356 పాయింట్ల లాభంతో 39,823 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. బాలయ్య షూటింగ్ షురూ!
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రానున్న చిత్రం.. అక్టోబరులో షూటింగ్ పునఃప్రారంభించుకోనుంది. ఇటీవలే విడుదలైన టీజర్ అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.