'రాజీపడే ప్రసక్తే లేదు'
కృష్ణా జలాలపై ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడతామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కృష్ణా జలాలపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం రావాల్సిన నీటి వాటాను సాధించుకుంటామన్నారు. శనివారం నారాయణపేట జిల్లాలో మంత్రి పర్యటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీక
తెలంగాణ రాష్ట్రంలో బోనాల ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బోనాల ఉత్సవాలు తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీకగా నిలుస్తాయని సీఎం స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
50వేలే భర్తీ చేస్తారా?
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖను రాశారు. సుమారు 2 లక్షల పోస్టులుంటే 50 వేలే భర్తీ చేస్తారా అని ప్రశ్నించారు. కరోనా వేళ స్టాఫ్ నర్సులను దేవుళ్లని పొగిడారు.. ప్రస్తుతం నర్సులు ప్రగతిభవన్ ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని లేఖలో వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'కేసీఆర్‌ను జైలుకు పంపుతాం'
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జైలుకు పంపుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్‌లో ఆయన పర్యటించారు. భాజపా త్యాగాల పార్టీ అని కొనియాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రోదసిలోకి తెలుగుతేజం
విశ్వవినువీధిలో తెలుగు కీర్తిపతాకం ఎగరబోతోంది. రోదసిపై తొలిసారి ఒక తెలుగు మహిళ అడుగుపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష ఈ ఘనత సాధించనున్నారు. కల్పనాచావ్లా, సునీత విలియమ్స్ తర్వాత రోదసీయానం చేయనున్న భారత సంతతి మహిళగా శిరీష చరిత్ర పుటలకెక్కనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
తమిళనాడు గవర్నర్‌గా రవిశంకర్ ప్రసాద్
కేంద్ర ఐటీ, న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన రవిశంకర్ ప్రసాద్ తమిళనాడు గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇటీవలే మంత్రి వర్గ విస్తరణకు ముందు.. కేంద్ర మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మత్తు రాకెట్
అక్రమంగా తరలిస్తున్న 354 కిలోల హెరాయిన్‌ను దిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం దీని విలువ రూ. 2,500 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
జులై 17నుంచి అయ్యప్ప దర్శనం
శబరిమల అయ్యప్ప దేవస్థానాన్ని జులై 17 నుంచి భక్తుల కోసం తెరవనున్నారు. జులై 21 వరకు జరిగే పూజ కార్యక్రమాల కోసం భక్తులకు ఈ అవకాశం కల్పించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
క్యాచ్ ఆఫ్ ది ఇయర్
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో కనీవినీ ఎరగని రీతిలో క్యాచ్ పట్టుకుని సామాన్యుల నుంచి దిగ్గజాల వరకు అందరీ దృష్టినీ ఆకర్షించింది టీమ్‌ఇండియా యువ క్రికెటర్ హర్లీన్ డియోల్(Harleen Deol). ఈ క్రమంలో వీరంతా ఆమెపై సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఇంతకీ ఎవరెవరు ఏమన్నారంటే? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కత్తి మహేశ్ కన్నుమూత
సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్ కన్నుమూశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తల, శరీరంపై తీవ్ర గాయాలు అవడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆయన కోలుకుంటున్నారని, వైద్యులు కూడా చెప్పారు. అయితే, శనివారం కత్తి మహేశ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.