ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @3PM - తెలంగాణ ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news
top ten news
author img

By

Published : Jun 4, 2021, 2:59 PM IST

Updated : Jun 4, 2021, 3:34 PM IST

వారం రోజుల్లో భాజపాలోకి...

వారం రోజుల్లో దిల్లీ వెళ్లి భాజపాలో చేరుతానని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం మీడియా ప్రతినిధులతో చేసిన చిట్‌చాట్‌లో ఈ మేరకు ఆయన స్పష్టం చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

ఆ టీకాలను కొనుగోలు చేయాలి

ప్రపంచానికే వ్యాక్సిన్ రాజధానిగా తెలంగాణ ఉన్నా, కేంద్ర అనాలోచిత నిర్ణయాల వల్లే దేశంలో వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆక్షేపించారు. ఇతర దేశాల్లో నిరుపయోగంగా ఉన్న ఆస్ట్రాజెనికా టీకాలను మన దేశానికి దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

తెలంగాణ హైకోర్టు అసహనం

తెలుగు రాష్ట్రాల హోంశాఖలపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర భద్రత కమిషన్, ప్రజా ఫిర్యాదుల సంస్థ ఏర్పాటులో జాప్యంపై ఆగ్రహించింది. కోర్టు ఆదేశాలు నాలుగు వారాల్లో అమలు చేయాలని హోంశాఖలను ఆదేశించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

'ఈటల కూడా అదే పాటించారు'

తెరాసలో చేరిన ఎంతో మంది వెళ్లిపోయారని.. వెళ్లేటప్పుడు కేసీఆర్​పై విమర్శలు చేశారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈటల కూడా అదే పాటించారని అన్నారు. సీఎం తెచ్చిన సంక్షేమ పథకాలపై అసంతృప్తి ఉంటే మంత్రి వర్గంలో చెప్పొచ్చు కదా అని ప్రశ్నించారు. తెరాస, కేసీఆర్​పై అనవసరంగా నోరు పారేసుకోవద్దని హెచ్చరించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

ఎస్సై రాసలీలలు

జవహర్‌నగర్ పీఎస్​ అనిల్‌ రాసలీలలు సాగించారు. ఎస్సైతో పాటు మహిళను తిమ్మాయిపల్లి సైలెంట్‌ వరల్డ్‌ రిసార్ట్స్‌లో కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

'ఆ రోజులు పోయాయ్​'

భారత్​ స్వతహాగా ఏడాదిలోనే కరోనా టీకాను తయారు చేసినందుకు శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇప్పుడు భారత్ అగ్ర దేశాలతో పాటు​ ఆవిష్కరణలలో వేగంగా దూసుకుపోతోందని కితాబిచ్చారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

జలాంతర్గాముల మెగా ప్రాజెక్టుకు ఆమోదం

నౌకాదళం కోసం దేశీయంగా ఆరు శక్తిమంతమైన జలాంతర్గాముల నిర్మాణం చేపట్టే మెగా ప్రాజెక్టుకు రక్షణశాఖ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. దాదాపు రూ.43వేల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

మసిబారుతున్న హిమాలయాలు

మానవ చర్యల వల్ల హిమాలయాలు మసిబారుతున్నాయని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. పర్వతాల్లోని మంచు వేగంగా తరిగిపోతోందని వెల్లడించింది. ఇటీవల హిమానీనదాలు కూలిపోయి, అకస్మాత్తుగా వరదలు రావడం.. వాతావరణ మార్పుల వల్ల తలెత్తుతున్న విపత్కర పరిస్థితులకు నిదర్శనమని ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా ప్రాంత ఉపాధ్యక్షుడు హార్ట్‌విగ్‌ స్కాఫర్‌ అన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

'ఇంగ్లాండ్​కు​ క్లీన్​స్వీప్ తప్పదు'

ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​లో భారత్​ సత్తా చాటుతుందని తెలిపారు క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్. నాలుగు టెస్టుల సిరీస్​ను క్లీన్​ స్వీప్​ చేస్తుందని అంచనా వేశారు. ఎండాకాలం కావడం వల్ల అక్కడి పిచ్​లు టర్న్​ అవ్వడమే ఇందుకు కారణంగా విశ్లేషించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

సర్​ప్రైజ్ అదిరింది!

మోహన్​బాబు హీరోగా నటిస్తోన్న పవర్​ఫుల్ యాక్షన్ ఎంటర్​టైనర్ 'సన్ ఆఫ్ ఇండియా'. తాజాగా ఈ సినిమా టీజర్​ను విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందించడం విశేషం. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Jun 4, 2021, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.