ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @3PM - తెలంగాణ ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

top ten news
టాప్​ టెన్​ న్యూస్​ @3PM
author img

By

Published : May 29, 2021, 2:55 PM IST

అదనపు ర్యాంపులు

హైదరాబాద్ నగరంలో శంషాబాద్ ఎయిర్​పోర్టు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన పీవీఎన్​ఆర్ ఎక్స్​ప్రెస్​ వే కోసం నిర్మించిన అదనపు ర్యాంపులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ.22 కోట్లతో అదనంగా రెండు ర్యాంపులను హెచ్​ఎండీఏ నిర్మించినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

సీఎంకు కేంద్రమంత్రి లేఖ

రాష్ట్రంలో అర్హులందరికి 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీని అమలు చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్​కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. వెంటనే పంపిణీకి చర్యలు చేపట్టాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

సీఎం కేసీఆర్ సమీక్ష

వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష చేపట్టారు. మంత్రి నిరంజన్‌ రెడ్డి, అధికారులతో భేటీ అయ్యారు. వానంకాలం పంటల సాగుపై చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

నివేదికలో ఏముంది..!

ఆనందయ్య ఔషదంపై నేడు ఆయుష్ నివేదిక వెలువడనుంది. ఆనందయ్య మందు వాడిన వారికి ఎటువంటి నష్టం కలగలేదని ఆయుష్ ఉన్నతస్థాయి అధికారుల బృందం ఇప్పటికే ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

తల్లి మరణం తట్టుకోలేక..

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో యువకుడి ఆత్మహత్య తీవ్ర విషాదం నింపింది. ఆత్మహత్యకు కారణాలు వివరిస్తూ శ్రీహరి అనే యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని చెరువులో దూకి బలవన్మరణం చేసుకున్నాడు. గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఇవాళ ఉదయం కరోనాతో తన తల్లి మరణించిందని వీడియోలో వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

కాక్​టెయిల్​ యాంటీబాడీస్​తో సత్ఫలితాలు

కరోనా రోగులకు కాక్‌టెయిల్‌ యాంటీబాడీస్‌ ఇవ్వడం వల్ల త్వరితగతిన కోలుకుంటున్నారని ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్‌ కె.గోపాలకృష్ణ తెలిపారు. ఇటీవల ప్రయోగాత్మకంగా విజయవాడలో ఇద్దరికి ఇలా చికిత్స అందించినట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

బంపర్​ ఆఫర్​

అమెరికాలోని కాలిఫోర్నియా సర్కారు వ్యాక్సినేషన్​లో వినూత్న వ్యూహాన్ని అమలు చేస్తోంది. టీకా తొలి డోసు తీసుకున్న వారికి 116 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.840 కోట్ల) లక్కీ డ్రాలో ఛాన్స్ ఇస్తామని ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

'వందేళ్ల' వేడుకలు

చైనా కమ్యునిస్టు పార్టీ.. వందేళ్ల ఆవిర్భావ వేడుకల్లో మునిగితేలుతోంది. చైనా ప్రజలు కలలుగన్న దేశాన్ని సాధించినట్లు ఈ సందర్భంగా పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఐపీఎల్​ రెండో దశ

యూఏఈ వేదికగా ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది బీసీసీఐ. అయితే షెడ్యూల్​ను ఇంకా ఖరారు చేయలేదని.. త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. భారత్​ వేదికగా టీ20 ప్రపంచకప్​ నిర్వహణపై జులై చివర్లో లేదా జూన్​ తొలి వారంలో తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

శిరీష్, అను కెమిస్ట్రీ అదుర్స్​

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా రూపొందుతోంది. శిరీష్ పుట్టినరోజైన మే 30న ఈ సినిమా ఫస్ట్​లుక్ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో విడుదల చేస్తోన్న ప్రీ లుక్​లు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.