'ఎల్‌ఆర్‌ఎస్ అమలు చేయొద్దు'
అనధికార లేఅవుట్‌లు, భవనాల క్రమబద్ధీకరణపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎల్ఆర్ఎస్‌పై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉందని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు నివేదించగా... సుప్రీంకోర్టు నిర్ణయించే వరకు ఎల్‌ఆర్‌ఎస్ అమలు చేయొద్దని హైకోర్టు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మామిడి ఎగుమతులకు ప్రోత్సాహం
మామిడి ఉత్పత్తి పెరుగుతున్నందున ఎగుమతుల ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇప్పటి వరకు చేస్తున్న ఎగుమతులతో పాటు మరింత పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన అనుబంధ శాఖల అధికారులతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'సీఎం ఎందుకు చెప్పడం లేదు'
కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు, మరణాలు తగ్గించి చూపిస్తున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'ప్రాణాలు కాపాడుతాం'
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. పీపీఈ కిట్ వేసుకుని కరోనా బాధితులను పరామర్శించారు. ఆస్పత్రిలో 650 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 400 మంది బాధితులు చికిత్స తీసుకుంటున్నారని అన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'విజయోత్సవ ర్యాలీలు నిషేధం'
మినీ పురపోరు ఓట్ల లెక్కింపు అనంతరం విజయోత్సవ ర్యాలీలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. కొవిడ్ విజృంభణ నేపథ్యంలో ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. గెలుపొందిన అభ్యర్థులు, వారి పార్టీలు, అనుచరులు ఎలాంటి ర్యాలీలు చేపట్టరాదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
గోవాలో లాక్డౌన్
కరోనా కట్టడికి గోవా ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఏప్రిల్ 29 నుంచి మే 3 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
భారీ అగ్నిప్రమాదం
మహారాష్ట్ర రత్నగిరిలోని ఓ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రాణనష్టమేమి జరగలేదని అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఐదుగురు మృతి
ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ మీర్జాపుర్‌లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
లారా ఆందోళన
ఈ సీజన్లో నిలకడగా ప్రదర్శన చేయలేకపోతున్న ముంబయి ఇండియన్స్ ఆటతీరుపై ఆందోళన వ్యక్తం చేశాడు వెస్డిండీస్ దిగ్గజం బ్రెయిన్ లారా. తర్వాతి మ్యాచుల్లోనైనా రోహిత్ సేన.. ప్రదర్శన ఎలా చేస్తుందోనని విచారణ వ్యక్తం చేశాడు. ముంబయి తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 29న దిల్లీ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రియాంక వల్లే..
నటిగా తనకు అవకాశాలు ఎక్కువగా రావట్లేదని వాపోయింది మీరాచోప్రా. ప్రియాంక చోప్రా సోదరి కావడం వల్లే ఇలా జరుగుతోందని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.