రామయ్యకు పట్టాభిషేకం
భద్రాద్రి రామయ్య పట్టాభిషేకం ఘనంగా జరిగింది. స్వర్ణఛత్ర, స్వర్ణ పాదుక, రాజదండ, రాజపట్ట, రాజముద్ర, సామ్రాట్ కిరీటం అలంకరించి వెండి సింహాసనంపై అయోధ్యాధిపతిని పట్టాభిషిక్తున్ని చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
భూమాతను కాపాడుకుందాం..
ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా భూమిని, పర్యావరణాన్ని కాపాడుకుందామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. నేలతల్లి బాగుంటేనే... మనతో పాటు భావితరాలు బాధలేకుండా జీవించగలుగుతారని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'భయమొద్దు'
కరోనా మహమ్మారి కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని సర్కార్ చెబుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రుల్లో పడకలు పెంపుతో పాటు మందుల లోటు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కబళించిన కరోనా
కరోనాకు బలవుతున్న వారి సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతోంది. కొవిడ్ సామాన్యులనే కాదు వైద్యులను పొట్టనబెట్టుకుంటోంది. తాజాగా హైదరాబాద్‌లోని విరించి ఆస్పత్రి సీనియర్ వైద్యుడు కరోనాతో మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
జోరుగా పోలింగ్
బంగాల్ ఆరోవిడత ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. కరోనా విజృంభణ వేళ.. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
దిల్లీలో అయిపోయిన ఆక్సిజన్ నిల్వలు
దిల్లీలో ఆక్సిజన్ నిల్వలు దాదాపుగా అయిపోయాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిశా నుంచి వచ్చే ఆక్సిజన్ కోసం ఎదురుచూస్తున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఉగ్రకుట్ర భగ్నం
భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రమూకలను పరుగులు పెట్టించాయి భద్రతా దళాలు. భారత్-పాకిస్థాన్ సరిహద్దు వెంబడి పంజాబ్ పఠాన్‌కోట్‌లో ప్రవేశించేందుకు యత్నించిగా సరిహద్దు భద్రతా దళం ఉగ్రవాదులను నిలువరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఏ మాస్కు మంచిదంటే?
భారత్‌ను కరోనా తాకి ఏడాది దాటింది. గత ఏడాది నుంచి మాస్కులు దేశ ప్రజల జీవితంలో ఓ భాగమయ్యాయి. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో మాస్కులు కీలక పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు పదేపదే చెబుతున్నారు. మరి ఎలాంటి మాస్కు ధరించాలి? ఎప్పుడు పెట్టుకోవాలి వంటి సందేహాలు తీరుస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ వీడియో విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సెమీస్‌లో అమిత్
రష్యా వేదికగా జరుగుతోన్న బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ అమిత్ పంగాల్ సెమీస్‌లో అడుగుపెట్టాడు. ఇతర విభాగాల్లో పోటీ పడిన మరో ఐదుగురు బాక్సర్ల టోర్నీని నిష్క్రమించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మెగాస్టార్ అల్లుడికి కరోనా
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.