ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​@9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

top ten news
టాప్​ టెన్​ న్యూస్​ @9AM
author img

By

Published : Apr 10, 2021, 8:59 AM IST

1.కరోనా కట్టడి కోసం

రాష్ట్రంలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం... అటు పరీక్షలు, ఇటు టీకా పంపిణీ పెంచేసింది. 24 గంటల వ్యవధిలో లక్ష పరీక్షలు నిర్వహించగా... లక్ష టీకాలు అందించింది. కొత్తగా 2,478 కొత్త కొవిడ్‌ కేసులు నమోదు కాగా... ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ఒక్కరోజులో నిర్ధరించిన కేసుల్లో ఇదే అత్యధికం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.మార్గదర్శకాలు ఖరారు

రాష్ట్రంలోని ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి ఆర్థిక సాయం పంపిణీకి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఈ మేరకు విద్యాసంస్థల నుంచి వివరాలను ఆన్‌లైన్‌లో తీసుకోనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.ఎక్కడికక్కడే ఆర్టీపీసీఆర్​ పరీక్షలు

కొవిడ్‌ నిర్ధారణలో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో.. ఆ మేరకు వైద్యఆరోగ్యశాఖ ప్రణాళికలు రూపొందించింది. మారుమూల ప్రాంతంలో నమూనాలు స్వీకరించి, సుదూర ప్రాంతంలో ఉన్న ఆర్‌టీపీసీఆర్‌ ల్యాబ్‌కు తరలించడం కష్టమని ఆరోగ్యశాఖ భావిస్తోంది. ఈ క్రమంలో గ్రామీణుల చెంతకే పరీక్షలను తీసుకెళ్లాలన్నది లక్ష్యం. దీనికోసం జిల్లా ఆసుపత్రుల్లో ల్యాబొరేటరీలను నెలకొల్పాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.సాయానికి లక్ష మంది దూరం?

ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది అందరికీ బడులు తెరిచే వరకు ఆర్థిక సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా కనీసం లక్ష మంది ఉపాధ్యాయులు అందుకు దూరమయ్యే అవకాశముంది. 3లక్షల మందికి ఉపాధ్యాయులను ఆదుకోవాలని ట్రస్మా కోరగా... డైస్‌ లెక్కల్లోనేమో 1.18 లక్షల మంది ఉపాధ్యాయులే ఉన్నట్లు నమోదవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.నాలుగో విడత

బంగాల్​ శాసనసభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్​ కొనసాగుతోంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్​ కేంద్రాలకు తరలివస్తున్నారు ప్రజలు. ఇప్పటికే పలు కేంద్రాల ముందు బారులుతీరారు ప్రజలు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు చేపట్టారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.రైతు ఉద్యమం

సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భాగంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి కుండ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్​ప్రెస్ వేను దిగ్భందించనున్నట్లు రైతు సంఘాలు పేర్కొన్నాయి. దిల్లీలో కొవిడ్​ వ్యాప్తి ఉన్నా ఉద్యమం ఆగదని స్పష్టం చేశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.'కశ్మీర్‌పై విదేశాల సలహాలు అక్కర్లేదు'

కశ్మీర్​ అంశంపై సలహాలిచ్చే దేశాలు ముందుగా వారి అంతర్గత సమస్యలపై దృష్టి సారించాలని హితవు పలికారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. జమ్ముకశ్మీర్​ భారత్​లో అంతర్భాగమని స్పష్టం చేశారు. జమ్ములోని ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మేనేజ్​మెంట్​ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.'త్వరగా బలగాల ఉపసంహరణ జరపాలి'

తూర్పు లద్దాఖ్​లోని హాట్​స్ప్రింగ్​, గోగ్రా, దెప్సాంగ్ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణే లక్ష్యంగా భారత్​-చైనా సైనికాధికారులు 11వ దఫా చర్చలు జరిపారు. అయితే.. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టాలని భారత్​ కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ది​ల్లీ వర్సెస్​ చెన్నై

ముంబయి వేదికగా దిల్లీ క్యాపిటల్స్​, చెన్నై సూపర్​కింగ్స్​ మధ్య శనివారం మ్యాచ్​ జరగనుంది. సాయంత్రం 7:30 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది. మరి ఈ సీజన్​లో తొలి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.మహేశ్​-త్రివిక్రమ్​ సినిమాలో పూజ!

మహేశ్​-త్రివిక్రమ్​ కాంబినేషన్​లో తెరకెక్కనున్న చిత్రంలో హీరోయిన్​గా పూజా హెగ్డేను ఎంపిక చేశారని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే కథ విన్న ఆమె స్టోరీకి ఫిదా అయినట్లు టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. ఏడాది చివర్లో సినిమా సెట్స్​పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.