1.టెస్టులు పెంచండి..
రాష్ట్రంలో కరోనా తిరిగి విజృంభిస్తున్న నేపథ్యంలో... వైరస్ పరీక్షలను భారీగా పెంచాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాలకు చెందిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి వందశాతం వ్యాక్సినేషన్ చేయించాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను వారం రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. దేశవ్యాప్తంగా కరోనా తిరిగి వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో.. ప్రజలందరూ ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2.మరో 2 నెలలు గడ్డురోజులే..!
రాష్ట్రంలో కొవిడ్ కేసులు రెండు నెలల కిందటి వరకూ కేవలం మూణ్నాలుగు జిల్లాల్లోనే మోస్తరుగానే నమోదయ్యేవి. ఇప్పుడు అతి వేగంగా వ్యాప్తి చెందుతుండడంతోపాటు అన్ని జిల్లాలకూ పాకింది. గత నెలతో పోల్చితే.. అన్ని జిల్లాల్లోనూ కేసుల సంఖ్య ఐదింతలకు పైగా పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3.జీవచ్ఛవానికి జీవితం
కన్న బిడ్డల నిరాదరణతో.. ఏడు పదుల వయసులో మొండిగోడల నడుమ జీవచ్ఛవంలా బతుకీడుస్తున్న పండుటాకు కంచర్ల మంగమ్మను ఆదుకోడానికి సమాజం ముందుకు వచ్చింది. ఆమె నమ్మకాన్ని నిలబెడుతూ.. ఆ పెద్దమ్మ దీనావస్థకు డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించారు. డీజీపీ చొరవతో అధికారులు మంగమ్మను సఖీ కేంద్రానికి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4.నేడే పార్టీ ప్రకటన
ఖమ్మం వేదికగా... వైఎస్ షర్మిల నిర్వహించ తలపెట్టిన సంకల్ప సభకు సర్వం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించే బహిరంగ సభ కోసం.. ఆమె అనుచరగణం ముమ్మర ఏర్పాట్లు చేసింది. పెవిలియన్ మైదానం వేదిక నిర్వహించే బహిరంగ సభకు... షర్మిల తల్లి విజయమ్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5.కొవాగ్జిన్ తయారీ పెంపు!
దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో టీకాలకు గిరాకీ బాగా పెరిగింది. దుష్ప్రభావాలు తక్కువగా ఉన్నాయని చెబుతున్న కొవాగ్జిన్ అడుగుతున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొవాగ్జిన్ టీకా తయారీని సాధ్యమైనంత పెంచడానికి భారత్ బయోటెక్ కసరత్తు చేస్తోంది. త్వరలో భారత్ బయోటెక్ బెంగళూరు యూనిట్ ప్రారంభించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6.కరోనాపై పోరు ఉద్ధృతం
దేశంలో కరోనా కట్టడికి ఈ నెల 11 నుంచి 14 వరకు 'టీకా ఉత్సవ్' నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశంలో కరోనా వైరస్ పరిస్థితిపై గురువారం సీఎంలతో సమీక్ష జరిపారు. రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి.. అందరి సలహాలు, సూచనలు స్వీకరించాలన్నారు. రాత్రిపూట విధించే కర్ఫ్యూలకు 'కరోనా కర్ఫ్యూ'గా నామకరణం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7.'అందరికీ టీకా'నే అత్యంత కీలకం
దేశంలో కరోనా 2.0 ఉగ్రరూపం దాల్చుతున్న వేళ కేంద్రం మరింత అప్రమత్తమైంది. విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించి, వైరస్ అనుమానితుల కూపీ లాగడం సహా.. వారికి సరైన చికిత్స అందించి, కొవిడ్ విధివిధానాలను పాటించడం ద్వారా వైరస్‌ను అదుపుచేయవచ్చని ప్రధాని మోదీ మాటల్లో స్పష్టమవుతోంది. విస్తరణ వ్యూహంలో భాగంగా.. ఈ నెల 11-14 మధ్య 'టీకా ఉత్సవ్' నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8.కరోనా విలయం
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ఇప్పటివరకు 13 కోట్ల 45లక్షలమందికిపైగా వైరస్ బారిన పడ్డారు. 29లక్షల మందికిపైగా మహమ్మారి కారణంగా బలయ్యారు. గురువారం కొన్ని దేశాల్లో రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9.ఐపీఎల్ షురూ..
ఇక వినోదమే వినోదం. కరోనా పెను సవాలు విసురుతుండగా.. భయాల మధ్యే, ఖాళీ స్టేడియాల్లోనే అభిమానులకు అలరించేందుకు, ఉత్సాహ పరిచేందుకు వచ్చేసింది ధనాధన్ పండగ. కళ్లు చెదిరే షాట్లతో ఉర్రూతలూగించేందుకు బ్యాట్స్‌మెన్.. అదిరే బౌలింగ్‌తో ఆకట్టుకునేందుకు బౌలర్లు, అబ్బురపరిచే విన్యాసాలతో ఊపేసేందుకు ఫీల్డర్లు సిద్ధం. నేటి నుంచే ఐపీఎల్ 2021. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. 'వకీల్‌సాబ్' హంగామా
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'వకీల్‌సాబ్' నేడు థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఈ సినిమా ప్రీమియర్ షో వీక్షించిన నిర్మాత దిల్‌రాజు థియేటర్లో పేపర్లు విసురుతూ పవన్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.