ETV Bharat / city

Telangana News Today టాప్​ న్యూస్​ 7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధానవార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS
author img

By

Published : Aug 16, 2022, 6:59 PM IST

  • దుష్ట శక్తులకు బుద్ధి చెబితేనే దేశం బాగుంటుందన్న కేసీఆర్‌

తెలంగాణ అన్నీ రంగాల్లో అభివృద్ధి పథంలో సాగుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రంలో ఉన్న భాజపా ఎనిమిదేళ్లలో ఒక్కటంటే ఒక్క మంచి చేసిందా అని ప్రశ్నించారు. వికారాబాద్​ జిల్లాకేంద్రంలో నూతన కలెక్టరేట్ భవనం​ ప్రారంభించిన సీఎం బహిరంగ సభలో కేంద్రం తీరుపై విమర్శలు సంధించారు.

  • భూవివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ, 10 మందికి గాయాలు

భూ వివాదం ఇరువర్గాల మధ్య చిచ్చుకు కారణమైంది. ఈ వివాదంలో రెండు గ్రూపులు ఘర్షణకు దిగడంతో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని అడ్డుకునేందుకు యత్నించిన ముగ్గురు పోలీసులకు సైతం స్వల్ప గాయాలయ్యాయి.

  • మెట్రోకు పెరుగుతోన్న ఆదరణ, రోజుకు 4 లక్షల మంది ప్రయాణం

హైదరాబాద్​ మెట్రోల్లో పూర్వవైభవం కనిపిస్తోంది. మెట్రోల్లో ప్రయాణిస్తోన్న ప్రయాణికుల సంఖ్య 4 లక్షలకు పెరగటమే అందుకు నిదర్శనం. మెట్రో స్టేషన్లలో కరోనాకు ముందు కనిపించిన రద్దీ మళ్లీ దర్శనమిస్తోంది.

  • భారత సైన్యానికి సరికొత్త అస్త్రాలు, దుందుడుకు చైనాకు ఇక చెక్

సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. జల, వాయు మార్గాల్లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది. పాంగాంగ్‌ సరస్సులో ఏ మూలకైనా నిమిషాల్లో చేరుకునేలా తయారు చేసిన బోటుతో సహా మరికొన్ని ఆయుధాలను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సైన్యానికి అందజేశారు.

  • తలాక్​పై సుప్రీం కీలక వ్యాఖ్యలు, ఆ రెండూ ఒకటి కాదంటూ

తలాక్ విషయంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నెలకు ఒకసారి చొప్పున వరుసగా మూడు నెలలు చెప్పే తలాక్- ఈ- హసన్​.. ముమ్మారు తలాక్ వేర్వేరు అని స్పష్టం చేసింది. ముస్లిం మహిళలు ఖులా ద్వారా భర్త నుంచి విడాకులు తీసుకునే అవకాశం ఉందన్న విషయాన్ని ప్రస్తావించింది.

  • బిల్కిస్ బానో అత్యాచార దోషుల విడుదలపై వివాదం, విపక్షాలు ఫైర్

గోద్రా అల్లర్ల సమయంలో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో దోషులను క్షమాభిక్ష కింద విడుదల చేయడం వివాదాస్పదమైంది. అత్యాచార కేసులో దోషులను ఈ విధానం కింద విడుదల చేయరాదని కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసినప్పటికీ, సుప్రీంకోర్టు సూచన మేరకు గుజరాత్‌ సర్కారు క్షమాభిక్ష పెట్టింది.

  • తండ్రి తనను రేప్ చేశాడని కుమార్తె ఆరోపణలు, ఐదున్నరేళ్ల తర్వాత నిర్దోషిగా

కుమార్తె చేసిన తప్పుడు అత్యాచార ఆరోపణల వల్ల అరెస్టైన ఓ వ్యక్తి ఐదున్నరేళ్ల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్ర అంధేరీలోని డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్​ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే

  • ఆ దేశాల మధ్య అణు యుద్ధం జరిగితే 500 కోట్ల మంది ప్రాణాలు గాల్లోకి

అత్యాధునిక అణు యుద్ధం సంభవిస్తే కనీసం 500 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని ఓ పరిశోధనలో తేలింది. అమెరికా-రష్యా మధ్య జరిగే అణు యుద్ధం భూగోళంపై భయంకరమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పరిశోధన తేల్చింది. ఈ యుద్ధం వల్ల సగానికిపైగా మానవాళి తుడిచిపెట్టుకుపోతుందని పేర్కొంది.

  • ఉద్యోగులకు యాపిల్​​ షాక్​, 100 మంది రిక్రూటర్లు తొలగింపు

కరోనా తర్వాత ప్రముఖ టెక్నాలజీ సంస్థలకు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టిపెట్టాయి. ఇప్పటికే నియామకాలను నిలిపివేసిన దిగ్గజ సంస్థలు ఉద్యోగాల్లో కూడా కోతలు పెడుతున్నాయి. 100 మంది ఒప్పంద రిక్రూటర్ల కాంట్రాక్టులను రద్దు చేస్తున్నట్లు యాపిల్​ కంపెనీ తెలిపింది.

  • శక్తితో కోలుకోలేని దెబ్బ.. కామెడీ సీన్స్​ తప్ప కథ లేని సినిమా అది

అలనాటి సీనియర్​ హీరోల నుంచి ప్రస్తుతం చిత్రసీమలో కొనసాగుతున్న బడా​, చిన్న హీరోల వరకు ప్రతిఒక్కరితో సినిమా తీశారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్​. ఇటీవలే ఆయన దుల్కర్​ సల్మాన్​తో రూపొందించిన 'సీతారామం' సూపర్​హిట్​ను అందుకుంది. ఈ సందర్భంగా ఆయన ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి పలు ఆసక్తికర సంగతులను తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.