ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు - live page

headline news
headline news
author img

By

Published : Aug 12, 2021, 6:09 AM IST

Updated : Aug 12, 2021, 9:55 PM IST

21:42 August 12

టాప్​ న్యూస్​ @10PM

  • పంద్రాగస్టున జిల్లాల్లో జెండా ఎగరేసే వాళ్లు వీరే..!

రాష్ట్రంలో స్వాతంత్య్ర దినోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేడుకల్లో ప్రదర్శించేందుకు ఇప్పటికే పోలీసులు కవాతు సాధన చేస్తున్నారు. ఇక పంద్రాగస్టున ఆయా జిల్లాల్లో పతకాన్ని ఆవిష్కరించే వారి పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది.

  • 'అమెరికా మమ్మల్ని పావులా వాడుకుంది'

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లను వెళ్లగొట్టేందుకు అమెరికా తమను పావులా వాడుకుందని పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రామ్​ఖాన్​ ఆరోపించారు. అగ్రరాజ్యం భారత్​కే అధిక ప్రాధాన్యం ఇస్తోందని వాపోయారు.

  • రిలయన్స్​ డిజిటల్​ బంపర్​ ఆఫర్లు​.. 

కస్టమర్లను ఆకట్టుకునేందుకు రిలయన్స్​ డిజిటల్​ ఆఫర్లు ప్రకటించింది. ఆగస్టు 16 వరకు ఇవి అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. రిలయన్స్​ డిజిటల్​, మై జియో స్టోర్లు సహా అధికారిక వెబ్​సైట్​లో ఈ సేల్స్​ ఉంటాయని సంస్థ వెల్లడించింది.

  • రోహిత్, రాహుల్​ అర్ధసెంచరీలు

ఇంగ్లాండ్​తో రెండో టెస్టులో.. టీ సమయానికి భారత్​ 2 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. రోహిత్​ శర్మ 83 పరుగులు చేసి ఔటయ్యాడు. పుజారా మళ్లీ నిరాశపర్చాడు. ఇంగ్లాండ్​ బౌలర్​ అండర్సన్​ 2 వికెట్లు తీశాడు. ప్రస్తుతం రాహుల్​, కోహ్లీ క్రీజులో ఉన్నారు.

  • చిరు 'లూసిఫర్' రెడీ.. షూటింగ్​కు టైమ్ ఫిక్స్

అగ్రకథానాయకుడు చిరంజీవి.. కొత్త సినిమా కోసం సిద్ధమయ్యారు. ఆయన నటించే 'లూసిఫర్' రీమేక్ చిత్రీకరణ ఆగస్టు 13 నుంచి మొదలు కానుంది.

20:50 August 12

టాప్​ న్యూస్​ @9PM

  • రాష్ట్రంలో భారీగా జిల్లా జడ్జీల బదిలీ

రాష్ట్రంలో 45 మంది జిల్లా జడ్జీలను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. 14 మంది సీనియర్ సివిల్ జడ్జీలకు జిల్లా జడ్జీలుగా తాత్కాలిక పదోన్నతి లభించింది. 

  • సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ 61 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు

సింగరేణిలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచారు. ఈ మేరకు సింగ‌రేణి ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31 నుంచి రిటైర్‌ అయిన అంద‌రికీ ఈ నిర్ణయం వర్తిస్తుందని పేర్కొంది.

  • మిజోరంలో 128 మంది చిన్నారులకు కరోనా..

కరోనా పిల్లలపై విరుచుకుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మిజోరంలో 576 కొత్త కేసులు నమోదవగా.. అందులో 126 మంది చిన్నారులే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కేరళలో కరోనా బీభత్సం కొనసాగుతోంది. కొత్తగా ఆ రాష్ట్రంలో 21వేలకు పైగా కేసులు వెలుగు చూశాయి.

  • ప్రపంచంలోనే మోస్ట్​ డేంజరస్​ కింగ్​కోబ్రా- 

ఉత్తరాఖండ్ నైనితాల్ జిల్లా కార్బెట్ టైగర్ రిజర్వ్‌ను ఆనుకుని ఉన్న ధేలా గ్రామంలో 20 అడుగులు పొడవైన కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన విష సర్పమని అటవీ శాఖ తెలిపింది. అనంతరం కింగ్​ కోబ్రాను అడవుల్లో సురక్షితంగా వదిలేశారు. ఈ కోబ్రా ఆసియాలోనే అత్యంత ప్రమాదకరమైందని.. ఒక్క కాటుతో ఏనుగును సైతం చంపే అంత విషాన్ని కలిగి ఉంటుందని తెలిపారు.

  • దేశభక్తి చిత్రం 'షేర్షా' ఎలా ఉందంటే?

కార్గిల్​ యుద్ధంలో అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిన కెప్టెన్‌ విక్రమ్‌ బాత్రా జీవితాధారంగా రూపొందిన చిత్రం 'షేర్షా'(Shershaah Movie). స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమెజాన్​ ప్రైమ్​ ఓటీటీ ద్వారా సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే దేశభక్తి చిత్రంగా రూపొందిన 'షేర్షా' విజయం సాధించిందా? కెప్టెన్​ విక్రమ్​ బాత్రా పాత్రలో హీరో సిద్ధార్థ్​ మల్హోత్రా(Sidharth Malhotra) ఏ విధంగా నటించాడు? అనే విశేషాలను ఈ సమీక్ష ద్వారా తెలుసుకోండి.

19:54 August 12

టాప్​ న్యూస్​ @8PM

  • కృష్ణా బోర్డు బృందం పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బృందం రాయలసీమ ఎత్తిపోతల పరిశీలన సమయంలో ఏపీ అధికారులు ఉన్న నేపథ్యంలో కమిటీ ఇచ్చే నివేదికపై తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్​కు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు. తెలంగాణ ఫిర్యాదు ఆధారంగా ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాల తర్వాత చాలా ఆలస్యంగా బోర్డు బృందం రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలించిందని అందులో పేర్కొన్నారు.  

  • 'వచ్చే ఎన్నికల్లో మోదీ గద్దె దిగడం ఖాయం'

రైతులు, దళితులు వినిపిస్తున్న వ్యతిరేక గళంతో మోదీ గద్దెదిగడం ఖాయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. వారి గొంతు సృష్టించిన తుపానుతో వచ్చే ఎన్నికల్లో భాజపా అధికారానికి దూరమవుతుందన్నారు.

  • బాయ్​ఫ్రెండ్​ కోసం యువతుల రచ్చ.. నడి రోడ్డు మీదే..!

బాయ్​ఫ్రెండ్​ కోసం ఇద్దరు యువతులు నడిరోడ్డు మీదే బాహాబాహీకి దిగారు. ఝార్ఖండ్​లోని సరాయకేలాలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్​ అయింది.

  • దిగొచ్చిన ద్రవ్యోల్బణం

దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి జూన్​ నెలలో 13.6శాతం వృద్ధి చెందింది. మరోవైపు, జులైలో ద్రవ్యోల్బణం 5.59శాతానికి తగ్గింది.

  • 'అవును.. ప్రపంచ అత్యుత్తమ ఫీల్డర్లలో నేనూ ఒకడిని!'

ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో తాను ఒకడినని ప్రముఖ భారత ఆల్​రౌండర్ జడేజా అంటున్నాడు​. శారీరక శ్రమ వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్​పై విజయం సాధించేందుకు టీమ్​ ఇండియాకే మెరుగైన అవకాశాలున్నాయని తెలిపాడు.

18:50 August 12

టాప్​ న్యూస్​ @7PM

  • తుపాకీతో రౌడీషీటర్‌ హల్‌చల్‌.. 

నిజామాబాద్‌లో ఓ రౌడీషీటర్‌ తుపాకీతో హల్‌చల్‌ చేశాడు. పట్టణానికి చెందిన ఆరిఫ్​ అనే రౌడీషీటర్​... పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆరిఫ్​... తుపాకీతో హల్​చల్​ చేశాడు. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది.

  • కాగితపు పడవలా కొట్టుకుపోయిన ఇల్లు

ఉత్తర్​ప్రదేశ్​ మీర్జాపుర్​లో భీకర వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా గంగా నది ఉప్పొంగి ప్రవాహిస్తోంది. బారియా ఘాట్​ ప్రాంతంలో ఓ ఇల్లు.. గంగానది వరదల్లో కాగితపు పడవలా కొట్టుకుపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

  • ఉవ్వెత్తున ఎగసిపడ్డ లావా

ఐరోపాలో అత్యంత క్రియాశీలకంగా ఉండే ఇటలీలోని మౌంట్​ ఎట్నా అగ్ని పర్వతం మరోసారి విస్ఫోటం చెందింది. దీంతో ఆకాశాన్ని తాకేలా పెద్దఎత్తున బూడిద విడుదలైంది. ఎగసిపడుతున్న అగ్నికీలల ధాటికి ఆ ప్రాంతమంతా నారింజ వర్ణాన్ని సంతరించుకుంది. ఈ దృశ్యాలను చిత్రించేందుకు ఫొటోగ్రాఫర్లు ఎగబడ్డారు.

  • రూ.4,537 కోట్ల క్రిప్టో కరెన్సీ హాంఫట్‌!

పాలినెట్‌వర్క్‌ యాప్‌లోని క్రిప్టో కరెన్సీని (cryptocurrency news) చోరులు కొల్లగొట్టారు. ఈ మొత్తం విలువ రూ.4,537 కోట్లు ఉంటుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొల్లగొట్టిన సొమ్మును తిరిగి ఇవ్వమని కోరుతూ హ్యాకర్స్​కు ప్రతినిధులు లేఖ రాశారు.

  • ఆ రోడ్​కు బాక్సర్ పేరు

విశ్వక్రీడల్లో పతకం సాధించిన అసోం తొలి క్రీడాకారిణి, బాక్సర్​ లవ్లీనా బోర్గోహైన్​కు రూ. కోటి అందించారు సీఎం హిమంత బిశ్వ శర్మ. గువాహటిలోని ఓ రోడ్డుకూ ఆమె పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు. ​

17:48 August 12

టాప్​ న్యూస్​ @6PM

  • సీఎం కేసీఆర్ సమీక్ష

ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేసిన దళితబంధు పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతిభవన్​లో సీఎస్ సోమేశ్ కుమార్, అధికారులతో సమీక్షిస్తున్న సీఎం... దళిత బంధు అమలుపై క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులతో చర్చిస్తున్నారు.

  • ఇకపై వర్జినిటీ టెస్ట్ లేకుండానే..

సైన్యంలో చేరాలంటే చేతులతో తడిమి చేసే వర్జినిటీ పరీక్షలు తప్పనిసరి అన్న విధానాన్ని ఇండోనేసియా రద్దు చేసింది. ఇకపై సాధారణ శారీరక, వైద్యపరమైన పరీక్షలనే ప్రామాణికంగా తీసుకుంటామని స్పష్టం చేసింది. దీనిపై మానవ హక్కుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

  • చందమామపై నీరు- కీలక ఆధారాలు లభ్యం!

చంద్రుడి ఉపరితలం మీద నీటి కణాలను (water on moon) గుర్తించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. చంద్రయాన్​-2 (chandrayaan 2 news) సేకరించిన డేటాతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. కరెంట్​ సైన్స్​ అనే జర్నల్​లో శాస్త్రవేత్తలు ఈ విషయాలను తెలిపారు.

  • మెడల్స్ టేబుల్​లో చైనా మాయ!

టోక్యో ఒలింపిక్స్​ పతకాల పట్టికను చైనా.. మార్ఫింగ్​ చేసింది! ఈ విషయమై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మెడల్స్ టేబుల్​లో అమెరికా అగ్రస్థానంలో నిలిచినా.. చైనా మీడియా మాత్రం తమ దేశమే నెం.1లో ఉన్నట్లు చూపించడమే ఇందుకు కారణం.

  • కొత్త సినిమా కబుర్లు..

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో సర్కారు వారి పాట, మీట్ క్యూట్, పెళ్లి సందD, చెహ్​రే, ఫస్ట్​టైమ్, మళ్లీ మొదలైంది, నగారా చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

16:50 August 12

టాప్​ న్యూస్​ @5PM

  •  మొదటి రోజు 2వేల కుటుంబాలకు.!

సీఎం కేసీఆర్​ ప్రకటించిన దళిత బంధు ఈ నెల 16న హుజూరాబాద్​ నియోజకవర్గంలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆ రోజు 2 వేల మందికి దళిత బంధు చెక్కులను కేసీఆర్​ అందజేయనున్నారు. ఈ మేరకు కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ మండలం శివారులో భారీ బహిరంగ ఏర్పాటు చేయనున్నారు. లక్షకు పైగా హాజరుకానున్న ఈ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను మంత్రులు పర్యవేక్షించారు.

  • 'న్యాయవ్యవస్థకు దన్నుగా నిలిచిన సింహం జస్టిస్ నారీమన్'

జస్టిస్​ ఆర్​ఎఫ్​ నారీమన్​ పదవీ విరమణతో న్యాయవ్యవస్థకు రక్షణగా ఉన్న సింహాల్లో ఒకదాన్ని కోల్పోయినట్లు తాను భావిస్తున్నాని సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తన ఏడేళ్ల పదవీకాలంలో ఎన్నో చారిత్రక తీర్పులను నారీమన్​ వెలువరించారని పేర్కొన్నారు.

  • ఆగని తాలిబన్ల దురాక్రమణ

అఫ్గానిస్థాన్​లో మరో నగరం తాలిబన్ల హస్తగతమైంది. వ్యూహాత్మకంగా కీలకమైన ఘాజ్నీ నగరాన్ని ముష్కరులు ఆక్రమించుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, అఫ్గాన్​కు భారత్ గిఫ్ట్​గా అందించిన ఓ హెలికాప్టర్​ను తాలిబన్లు తమ అధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

  • కామెంట్లకు ఇకపై చెక్

ఇన్​స్టాలో నెగటివ్​ కామెంట్ల పెట్టేవారికి ఇక కష్టమే. ఎందుకంటే అలాంటి వాటిని నిరోధించేందుకు సదరు సోషల్ మీడియా ఫ్లాట్​ఫామ్ సరికొత్త ఫీచర్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

  • ఫ్యాన్స్​కు పండగే

చెన్నై సూపర్​ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. తమిళ హీరో విజయ్​ను (Dhoni Vijay) కలిశాడు. ప్రాక్టీస్​లో భాగంగా మహి చెన్నైలో ఉండగా.. బీస్ట్​ షూటింగ్​లో (Beast Vijay) భాగంగా గోకులం స్టూడియోస్​లో విజయ్​ నటిస్తున్నారు.

15:47 August 12

టాప్​ న్యూస్​ @4PM

  • హరీశ్​కు ఈటల సవాల్

మంత్రి హరీశ్​రావుపై మరోసారి ఈటల రాజేందర్ విరుచుకుపడ్డారు. హరీశ్‌ మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని పేర్కొన్నారు. తనకున్న ఆస్తులు, నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్దమని మంత్రి హరీశ్‌రావుకు ఈటల సవాల్‌ విసిరారు.

  • జవాన్ల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి

జమ్ముకశ్మీర్​ కుల్గాంలో బీఎస్‌ఎఫ్‌ జవాన్ల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. జవాన్లు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగినట్లు కశ్మీర్ ఐజీపీ తెలిపారు. కొందరు ఉగ్రవాదులను బందీగా పట్టుకున్నట్లు వెల్లడించారు.

  • కరోనా టీకా వల్ల గర్భధారణలో సమస్యలు వస్తాయా?

కరోనా టీకా.. సంతాన సాఫల్యంపై ప్రభావం చూపిస్తుందా? గర్భం ధరించే అవకాశాలను తగ్గిస్తుందా? గర్భధారణ అంశంలో సమస్యలు వస్తాయా? వంటి సందేహాలు అనేక మందికి కలుగుతున్నాయి. అయితే ఇవేవీ నిజం కాదని అంటున్నారు వైద్య నిపుణులు. అవన్నీ అపోహలేనని స్పష్టం చేస్తున్నారు.

  • మార్కెట్లకు భారీ లాభాలు

గురువారం సెషన్​లో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను గడించాయి. సెన్సెక్స్ 318 పాయింట్ల లాభంతో 54,844 వద్దకు చేరింది. నిఫ్టీ 82 పాయింట్లు పెరిగి 16,300 పైన స్థిరపడింది. ఇండస్​ ఇండ్ బ్యాంక్, ఎస్​బీఐ షేర్లు భారీ లాభాలను గడించాయి.

  • Ind vs Eng: భారత్​ బ్యాటింగ్​

లార్డ్స్​ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టాస్​ గెలిచిన ఇంగ్లాండ్​.. ఫీల్డింగ్​ ఎంచుకుంది. కోహ్లీ సేన బ్యాటింగ్​ చేయనుంది. వర్షం కారణంగా.. టాస్​ ఆలస్యం అయింది.

14:45 August 12

టాప్​ న్యూస్​ @3PM

  • సొంత స్థలాలు ఉంటే.. ఈ ఏడాది నుంచే ఇళ్లు కట్టిస్తాం

సొంత స్థలాలు ఉన్న వారికి ప్రభుత్వం ఇళ్లు కట్టించే ప్రక్రియ ఈ ఏడాది నుంచే అమలు కానుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు వెల్లడించారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలను అభివృద్ధి చేసిన ఏకైక ప్రభుత్వం తెరాసదేనని స్పష్టం చేశారు.

  • 'మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి'

మహిళలు తలుచుకుంటే ఎలాంటి మార్పునైనా తీసుకురాగలరని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 'ఆత్మనిర్భర్ నారీ శక్తి సే సంవాద్​' కార్యక్రమంలో భాగంగా పలువురు సహకార సంఘాల మహిళలతో ఆయన సమావేశమయ్యారు.

  • రూ.20కోట్లతో క్యాష్ వ్యాన్ డ్రైవర్​ పరార్!

బ్యాంకులో జమ చేయాల్సిన రూ.20కోట్ల నగదుతో పరారయ్యాడు ఓ వ్యాన్ డ్రైవర్. ఈ ఘటన పాకిస్థాన్​లోని కరాచీలో జరిగింది.

  • ప్రపంచ అథ్లెటిక్స్​ ర్యాంకింగ్స్​లో దుమ్మురేపిన నీరజ్

ప్రపంచ అథ్లెటిక్స్​ ర్యాంకింగ్స్​లో రెండో స్థానం కైవసం చేసుకున్నాడు నీరజ్​ చోప్డా. టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణం సాధించడం ద్వారా ఈ మైలురాయికి చేరాడు.

  • రేలంగి విజిలేస్తే రౌడీలు వచ్చేవారట!

ఎన్నో మంచి సినిమాలు తీసి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రేలంగి నరసింహారావు.. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' షోలో సందడి చేశారు. తన పాత జ్ఞాపకాలను ఆద్యంతం నవ్వుతూ వెల్లడించారు.

13:56 August 12

టాప్​ న్యూస్​ @2PM

  • అడ్డుకోండి..

కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖ రాసింది. బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ తరఫున ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు. ఏపీ అక్రమంగా జలాలు తరలించకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. 

  • అక్కడ బీసీ.. ఇక్కడ ఓసీ..

మాజీ మంత్రి ఈటల రాజేందర్​పై పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ విరుచుకుపడ్డారు. నాగార్జునసాగర్​లో జానాకు పట్టిన గతే హుజూరాబాద్​లో ఈటలకు పడుతుందన్నారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​ యాదవ్​ను బానిసగా పేర్కొనడం.. ఈటల అహంకారానికి నిదర్శనమన్నారు.

  • హత్య కేసులో పురోగతి..

ఏపీకి చెందిన స్థిరాస్తి వ్యాపారి విజయభాస్కర్​ రెడ్డి హత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. హత్య కేసులో కీలక నిందితుడు త్రిలోక్​నాథ్​ బాబాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ముందు మృతుడికి ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చిన నిందితుడు మల్లేశ్​ కుమారుడు కార్తీక్​ను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

  • సువాసననిచ్చే మాస్కులు..

కరోనా విజృంభణ నుంచి ముఖానికి ​మాస్కులు నిత్యకృత్యమయ్యాయి. ఎల్లవేళలా ముఖానికి పెట్టుకునే ఈ మాస్కులు అందంగా ఉండేలా చూసుకుంటారు చాలామంది. మరి అవే మాస్కులు సువాసననూ వెదల్లితే? అలాంటి వాటినే తయారుచేస్తున్నాడో పూల విక్రేత.

  • బ్రహ్మీ అదుర్స్..

తెలుగు సినీ ప్రేక్షకులకు వరంగా దొరికిన నటుడు బ్రహ్మానందం. ఆయన కామెడీకి కడుపుబ్బా నవ్వుకోని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఆయన హాస్యమే కాదు నవరసాల్ని అలవోకగా పండించగలరు. అందుకు నిదర్శనమే ఈ వీడియో.

12:55 August 12

టాప్​ న్యూస్​ @1PM

  • రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖ..

కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖ రాసింది. ఏపీ అక్రమంగా జలాలు తరలించకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. అనుమతి లేని ప్రాజెక్టుల ద్వారా తరలింపు అడ్డుకోవాలని కోరింది. 

  • మల్లన్న సన్నిధిలో అమిత్​షా కుటుంబం..

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కుటుంబసమేతంగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్​కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్‌లో కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లారు.

  • కళాశాలలకు షాక్​..

ఇంజినీరింగ్‌ కళాశాలలకు జేఎన్‌టీయూహెచ్‌ మరో షాక్‌ ఇచ్చింది. సైన్స్‌, హ్యుమానిటీస్‌ అధ్యాపకులుగా పనిచేయడానికి కొత్త నిబంధన తీసుకువచ్చింది. అధ్యాపకులకు పీహెచ్‌డీ తప్పనిసరి అన్న నిబంధన విధించింది. అది లేకపోతే నెట్‌, స్లెట్‌లలో ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది.

  •  పోలీసులకు మెడల్స్..

కేంద్ర హోంమంత్రి మెడల్ ఫర్ ఎక్స్​లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అవార్డుకు దేశవ్యాప్తంగా 152 మంది పోలీసులు ఎంపికయ్యారు. అత్యధికంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి 11 మంది ఎంపికైనట్లు కేంద్రం తెలిపింది. ఏపీ, తెలంగాణ నుంచి ఐదుగురు చొప్పున మెడల్ అందుకోనున్నట్లు వెల్లడించింది.

  • అల్లుడు అదుర్స్..

పది వేల కేజీల స్వీట్లు.. వంద అరటి గెలలు.. రెండు వ్యాన్లలో పండ్లు, పూలు.. వందలాది చీరలు, రవికలు. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా..? శ్రావణ మాసం ప్రారంభంలో కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చిన సందర్భంగా తీసుకొచ్చిన సారె. గోదారోళ్ల సారె గోదారంత అన్నట్లు.. కొత్త అల్లుడు తెచ్చిన సారె ఔరా..! అనిపించింది.

11:43 August 12

టాప్​ న్యూస్​ @12PM

  • భారీ అగ్నిప్రమాదం..

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ మండలం ధర్మోజిగూడ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రసాయన పరిశ్రమలో వెల్డింగ్​ పనులు చేస్తుండగా.. నిప్పురవ్వలు ఎగిరిపడి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

  • భారీగా పెరిగిన బంగారం ధర..

బంగారం ధరలు గురువారం భారీగా పెరిగాయి. అయితే, వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • 'రైతన్న'ను అందరూ చూడాలి..

వ్యవసాయం దండగ కాదు... పండగ అనే రోజు రావాలంటూ ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి తీసిన సినిమాయే రైతన్న అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) అన్నారు. నారాయణమూర్తి కథానాయకుడిగా నటిస్తూ... స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం రైతుల సమస్యలు, వాటికి పరిష్కారాలు, రైతులకు జరగుతున్న అన్యాయం గురించి తెలియజేసేలా ఉందని తెలిపారు.

  • దళితబంధు పైసలు ఏం చేస్తవమ్మ..

దళిత బంధు పథకం(Dalitha Bandhu Scheme)పై ఎస్సీ కార్పొరేషన్ అధికారులు దళితులకు అవగాహన కల్పిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో పర్యటించి.. ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. లబ్ధిదారులకు పథకం గురించి తెలియజేసి.. వారు ఆ నగదును ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో వివరిస్తున్నారు.

  • నల్ల చట్టాలను రద్దు చేయాలి..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రతిపక్ష నేతలు. పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. దేశంలో 60 శాతం మంది ప్రజలు పార్లమెంట్ సమావేశాలు జరగలేదనే అనుకున్నారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.

10:50 August 12

టాప్​ న్యూస్​ @11AM

  • మావోయిస్టుల అరెస్ట్..

ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్​ అయిన వారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే అంగరక్షకులు సహా కీలక వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. 

  • భగత్​ అనే నేను..

శాసనసభ్యుడిగా నోముల భగత్‌ ప్రమాణస్వీకారం చేశారు. సభాపతి పోచారం ప్రమాణం చేయించారు. ఇటీవల నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో నోముల భగత్‌ గెలుపొందారు.

  • రికార్డుస్థాయిలో కనెక్షన్లు..

గ్రేటర్​లో రోజురోజుకు విద్యుత్​ డిమాండ్​తో పాటు కొత్త కనెక్షన్లు పెరుగుతున్నాయి. ఆరు నెలలుగా శివారు ప్రాంతాల్లో కొత్త నిర్మాణాలు భారీగా చేపడుతున్న నేపథ్యంలో కనెక్షన్ల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోందని విద్యుత్​శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గ్రేటర్​ జోన్​ పరిధిలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో ఆరు నెలల్లో రికార్డుస్థాయిలో 1.26 లక్షల కొత్త విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేసినట్లు విద్యుత్ శాఖ చెబుతోంది. అంటే నెలకు సగటున 21,000ల విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

  • విమానం వైపు అడుగులు..

దేశంలో విమానయాన ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతేడాది ప్రయాణికుల సంఖ్యతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం నాలుగు రెట్లుకుపైగా పెరిగినట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జూన్‌ నెలలో 5.18లక్షలు మంది విదేశీ ప్రయాణం చేయగా.. 59.94లక్షల మంది స్వదేశీ ప్రయాణం చేశారు.

  • ఆందోళన అనవసరం..

ఇంగ్లాండ్​తో రెండో టెస్టు​ ప్రారంభానికి ముందు పుజారా, రహానే, పంత్​ ఆటతీరు​పై స్పందించాడు విరాట్​ కోహ్లీ. పుజారా, రహానే ఫామ్​పై తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని.. అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదని అభిప్రాయపడ్డాడు. ఇక పంత్​ దూకుడుగానే ఆడతాడని.. జట్టు కూడా అతడి నుంచి అదే ఆశిస్తోందని చెప్పుకొచ్చాడు.

09:53 August 12

టాప్​ న్యూస్​ @10AM

  • మరో 41,195మందికి కరోనా..

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 41,195మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది.

  • క్రిమినల్స్​ హతం..

దిల్లీలోని ఖజురి ఖాస్ ప్రాంతంలో ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు క్రిమినల్స్​ హతమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడినట్లు వెల్లడించారు.

  • ఆ పసివాడికి ఏం తెలుసు..

అమ్మ ఫోన్‌ రింగయింది. అంతే! మూడేళ్ల చిన్నారి పరుగున ఇంట్లోకెళ్లి దాన్ని చేతికందుకున్నాడు. 'అమ్మా నీకు ఫోన్‌ వచ్చింది మాట్లాడు' అంటూ సెల్‌ఫోన్‌ను తల్లి మొహం వద్ద పెట్టాడు. అమ్మ ఇక లేదని.. ఆమె అప్పటికే చనిపోయిందని.. తెలియని ఆ చిన్నారి తల్లి స్పందించకపోవడంతో బిక్కమొహం వేశాడు. ఫోన్‌ను తల్లి నోటి వద్దే ఉంచి అలా నిస్తేజంగా ఉండిపోయాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండల కేంద్రంలో యువ వైద్యురాలు బలవన్మరణానికి పాల్పడ్డారు. అక్కడ కన్పించిన హృదయ విదారక దృశ్యమిది.

  • ఇమ్యూనిటీ పవర్ పొందాలంటే..

కరోనా వ్యాప్తితో మన జీవనశైలితో పాటు ఆహారపుటలవాట్లూ మారాయి. జంక్​ఫుడ్, ప్రాసెస్​డ్​ ఫుడ్​ను ఎక్కువగా ఇష్టపడే వాళ్లంతా.. ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్, హెల్దీ డైట్(Post Covid Diet)​కు మొగ్గు చూపుతున్నారు. కరోనా బారిన పడినవారూ.. కొవిడ్ నుంచి కోలుకున్నవారూ.. ఆరోగ్యపరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో.. రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడం అత్యవసరం. అయితే.. ఇమ్యూనిటీ పవర్ పెంచేందుకు మీ ఆహారపుటలవాట్లలో కొన్ని మార్పులు(Post Covid Diet) చేసుకోవాలి. అవేంటంటే?

  • నీరజ్ సూచనలు..

నీరజ్​ చోప్డా, అర్షద్​ నదీమ్​.. టోక్యో ఒలింపిక్స్​లో ఆసియా తరఫున జావెలిన్​ త్రో ఈవెంట్​లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత్​- పాక్​ అథ్లెట్లు. నీరజ్​ పసిడిని ముద్దాడగా.. నదీమ్​ మాత్రం 5వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆ తర్వాత.. నదీమ్​తో తాను మాట్లాడినట్లు తెలిపాడు నీరజ్.

08:52 August 12

టాప్​ న్యూస్​ @9AM

  • పది రోజుల్లో జీవో జారీ

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల హేతుబద్ధీకరణకు అవసరమైన మార్గదర్శకాలతో త్వరలోనే ప్రభుత్వం జీవో జారీ చేయనుంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులను నిర్ణయించనున్నట్లు అధికారులు తెలిపారు.

  • క్లిక్​ చేస్తే ఖాతా ఖల్లాస్..

అమెజాన్‌లో పార్ట్‌టైం జాబ్​ అంటూ మెసేజ్​లు వస్తాయి... లింక్ పంపిస్తారు.. క్లిక్​ చేస్తే.. ఇక అంతే సంగతులు. డబ్బులు వచ్చినట్టే కనిపిస్తాయి.. విత్​డ్రా చేసుకునేందుకు యత్నిస్తే రావు. ఇలాంటి ఎస్‌ఎంఎస్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ హరినాథ్‌ హెచ్చరిస్తున్నారు.

  • ఆ రాష్ట్రాలే బెటర్​!

రాజస్థాన్, హిమాచల్​ ప్రదేశ్​, మిజోరం సహా ఐదు ప్రాంతాల్లో పెద్దలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందుతున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఆర్థిక, సామాజిక స్థితులు సహా వైద్య వ్యవస్థ, ఆదాయ భద్రత అంశాలను పరిగణించి ఈ పరిశోధన చేపట్టినట్లు తెలుస్తోంది.

  • 13కు చేరిన మృతులు..

హిమాచల్ ప్రదేశ్​లోని కిన్నౌర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. ఈ విషయాన్ని ఐటీబీపీ అధికారులు స్పష్టం చేశారు.

  • అనుకోకుండా ఓ ఘటన..

టోక్యో ఒలింపిక్స్​ పురుషుల 110 మీటర్ల హర్డిల్స్​ రేస్​లో ప్రపంచ ఛాంపియన్​ గ్రాంట్​కే షాక్​ ఇచ్చి పసిడిని ఎగరేసుకుపోయాడు జమైకన్​ అథ్లెట్​ హాన్స్​లే పార్చ్​మెంట్. అయితే ఓ దశలో అతడు సెమీస్​లో ఆడలేని పరిస్థితి ఎదుర్కొన్నాడు. కానీ ఓ వాలంటీర్ సాయంతో ఏకంగా పసిడినే గెలిచాడు.

07:49 August 12

టాప్​ న్యూస్ @8AM

  • ప్రజాక్షేత్రంలో మాటల యుద్ధం..

రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఈ విషయం మాజీ మంత్రి ఈటలను, తెరాసలో ఉన్నప్పుడు ఆయనతో సన్నిహితంగా ఉన్న పార్టీ నాయకులను చూస్తే అర్థమైపోతుంది. ఒకప్పుడు ఈటలతో అత్యంత సన్నిహితంగా మెలిగిన అనేకమంది అధికార పార్టీ నేతలు... నేడు పరస్పర విమర్శలు చేసుకోవడం విశేషం.

  • కృష్ణమ్మలో కలుస్తున్న ఊరు..

ఏపీలో కృష్ణానది పరివాహకంగా ఉన్న ఆ గ్రామం.. క్రమంగా నీట మునుగుతోంది. వరద నీటి ఉద్ధృతి ఎక్కువైనప్పుడు భూమి కోతకు గురవుతూ.. నది ముందుకు వస్తోంది. దీంతో సమీపంలోని ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. క్రమంగా ఇళ్లు అదృశ్యమవుతూ.. గ్రామమే కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు వాపోతున్నారు.

  • త్వరలోనే భర్తీ..

నూతన జోనల్ విధానానికి (zonal process) అనుగుణంగా ఉద్యోగుల విభజన దిశగా కసరత్తు ప్రారంభమవుతోంది. ఇప్పటికే పోస్టులను వర్గీకరించిన ప్రభుత్వం... తదుపరి కేడర్ స్ట్రెంత్ ఖరారు చేయనుంది. ప్రక్రియ మొత్తం పూర్తైన తర్వాత ఖాళీలు, నియామకాలపై స్పష్టత రానుంది. నెలాఖరు వరకు ఈ ప్రక్రియను (job vacancies) పూర్తి చేయాలని భావిస్తున్నారు.

  • మరో ఐదుగురి​ ఖాతాలు లాక్​!

రణదీప్​ సూర్జేవాలా సహా తన పార్టీకి చెందిన మరో నలుగురు నేతల ట్విట్టర్​ ఖాతాలు లాక్​ అయ్యాయని కాంగ్రెస్ ఆరోపించింది. ట్విట్టర్‌ ఖాతాలను బ్లాక్‌ చేసే కాంగ్రెస్‌ నేతల జాబితా మరింత పెరగొచ్చని తెలిపింది.

  • 16 మందితో కూలిన హెలికాప్టర్​..

రష్యాలో 16 మంది పర్యటకులతో ప్రయణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. ఈ మేరకు ఆ దేశ అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది.

07:27 August 12

టాప్​ న్యూస్​ @7AM

  • దారితప్పిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికే విఫలం అయింది. మూడో దశలో సాంకేతిక లోపంతో ఈ ప్రయోగం విఫలం అయిందని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ తెలిపారు.

  • విద్యాసంస్థలు తెరవొచ్చు..

తెలంగాణలో విద్యాసంస్థలు తెరవడానికి వైద్యశాఖ (Health Department) గ్రీన్​సిగ్నల్ ఇచ్చింది. గతేడాది మార్చి నెలాఖరు నుంచి ఇప్పటి వరకూ మధ్యలో రెండు మాసాలు మినహా నిరవధికంగా విద్యాసంస్థలు మూసే ఉన్నాయి. వీటిని మళ్లీ ప్రారంభించేందుకు ఇది అనుకూల సమయమేనని వైద్యశాఖ పేర్కొంది.

  • కనిపించని వరుణుడి జాడ..

రాష్ట్రంలో మొన్నటి వరకు తడిసి ముద్దైన నేలలు నేడు బీడులు వారుతున్నాయి. మబ్బులు ముఖం చాటేయడం వల్ల ఎండిపోతున్న పంటను చూస్తున్న అన్నదాత గొంతులో తడారిపోతోంది. వర్షాభావంతో రెండు నెలల పైరులో ఎదుగుదల నిల్చిపోయింది. మరో ఐదారు రోజుల్లో వానలు పడకపోతే వర్షాధారంగా సాగైన సుమారు 20 లక్షల ఎకరాల్లో పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

  • వచ్చే నెలలో నిర్ణయం..

కొవాగ్జిన్‌ టీకా అత్యవసర అనుమతిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) వచ్చే నెలలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు డబ్ల్యూహెచ్​ఓలో వ్యాక్సిన్లపై సహాయ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న మరియాంజెలా సిమావో తెలిపారు.

  • పోలీసుల ముందుకు నటుడు ఆర్య..

తమిళ హీరో ఆర్య(Hero Arya cheating case) తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడని శ్రీలంకకు చెందిన ఓ యువతి పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన అధికారులు తాజాగా నటుడిని మూడు గంటల పాటు విచారించారు.

02:01 August 12

టాప్​ న్యూస్​@ 6AM

  • భవిష్యత్​ యువతదే...

భవిష్యత్తులో అన్ని రంగాల్లో యువతతే కీలకపాత్ర అని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతకు.. సీఎం కేసీఆర్​ శుభాకాంక్షలు తెలిపారు.

  • త్వరలోనే భర్తీ...

  • సజీవ సమాధి

రాజస్థాన్​లో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ క్వారీలో శిథిలాలు మీద పడి ఏడుగురు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.

  • సునామీ హెచ్చరిక

ఫిలిప్పీన్స్‌లోని పొందగిటాన్‌లో భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేల్‌పై 7.1 తీవ్రతగా నమోదైంది. మరోవైపు అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం.. ఫిలిప్పీన్స్‌కు సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

  • గడువుకన్నా ముందే..

పార్లమెంటు ఉభయసభలు నిరవధిక వాయిదా పడ్డాయి. సభ్యుల ఆందోళనల నేపథ్యంలో షెడ్యూల్ కంటే ముందుగానే లోక్​సభ వాయిదా పడగా.. రాజ్యసభను సైతం నిరవధిక వాయిదా వేస్తూ ఛైర్మన్ వెంకయ్యనాయుడు నిర్ణయం తీసుకున్నారు.

 కేంద్ర హోమంత్రి అమిత్ షా నేడు శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్నారు. దిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా అక్కడి నుంచి శ్రీశైలం రానున్నారు. దర్శనానంతరం తిరిగి దిల్లీకి పయనం కానున్నారు.

  • అదే కీలకం

కేంద్ర ప్రభుత్వం 2014లో సంసద్‌ ఆదర్శ గ్రామ యోజన (ఎస్‌ఏజీవై-సాగీ) పథకాన్ని ప్రారంభించింది. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, జీవనోపాధి అవకాశాలు కల్పించడం, అసమానతలు తగ్గించడం, వారిలో చైతన్యం కలిగించడం వంటివి సాగీ ప్రధాన లక్ష్యాలు. 

  • ఎవరిది పైచేయి?

ఐదు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో ఆధిక్యమే లక్ష్యంగా భారత్, ఇంగ్లాండ్​ జట్ల మధ్య రెండో టెస్టు ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానం వేదికగా.. నేటి నుంచి జరగనుంది. తొలిటెస్టులో వరుణుడి కారణంగా విజయానికి దూరమైన టీమ్​ ఇండియా రెండో టెస్ట్‌లోనైనా జయభేరి మోగించాలని ఊవ్విళ్లూరుతోంది. 

  • దసరా బరిలో బాలయ్య..!

బాలయ్య 'అఖండ' రాకకు రంగం సిద్ధమైంది. బుధవారంతో చిత్రీకరణ పూర్తవగా, త్వరలో విడుదల తేదీపై స్పష్టత ఇవ్వనున్నారు.

Last Updated : Aug 12, 2021, 9:55 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.