ఆరోగ్యవంతమైన రాష్ట్రాల జాబితాలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణను మొదటి స్థానంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శిశువు జన్మించిన వెంటనే ఆరోగ్య సమస్యలు ఉంటే గుర్తించేందుకు నీలోఫర్ ఆసుపత్రిలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామన్నారు. తద్వారా సమస్యను వెంటనే గుర్తించడం, తక్కువ ఖర్చుతో వ్యాధిని నయం చేసుకునే ఆవకాశాలు అధికంగా ఉంటాయన్నారు.
వినికిడి దినోత్సవం సందర్భంగా కూకట్పల్లిలో డా. రావూస్ ఈఎన్టీ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు కిలోమీటర్ల నడక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇదీ చూడండి: అక్రమ వసూళ్లు.. అవినీతి 'రహదారి'..!