బీమా వైద్య సేవల కుంభకోణంలో నిందితులుగా ఉన్న బాబ్జీ ఆస్తులను జప్తు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. బీమా వైద్య సేవల విభాగంలో అధికారులతో కలిసి ఓమ్ని మెడి సంస్థ ఎండీ బాబ్జీ అక్రమాలకు పాల్పడినట్లు అనిశా అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. బాబ్జీ తన పేరుతో పాటు తన కుటుంబ సభ్యులు, బినామీ పేర్ల మీద రూ.162 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించినట్లు అనిశా అధికారులు ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఈ కేసులో అనిశా అధికారులు ఇప్పటికే బాబ్జీని అరెస్టు చేశారు. ప్రస్తుతం కేసు న్యాయస్థానంలో ఉంది. బాబ్జీ తన భార్య ఇద్దరు పిల్లల పేర్ల మీద అక్రమంగా కూడబెట్టిన డబ్బును జప్తు చేయాలని అనిశా డీజీ రాసిన లేఖను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో అనిశా అధికారులు కేసు దర్యాప్తు వేగవంతం చేశారు.