ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 16 మందిని అరెస్టు చేశారు. ఆర్‌సీ పురం ఈఎస్‌ఐ ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ సురేంద్రబాబు, నాచారం ఆసుపత్రి ఫార్మసిస్టు నాగలక్ష్మి, లైఫ్ కేర్ ఫార్మా సంస్థ ఎండీ సుధాకర్‌రెడ్డి, వెంకటేశ్వర హెల్త్ కేర్ సంస్థ నిర్వాహకుడు వెంకటేశ్వర్లును కోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. వీరిని ఈ కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఏంటి అనే అంశంపై విచారిస్తున్నారు. ప్రధానంగా వంద కోట్ల రూపాయలకు సంబంధించి లెక్కలు తేలడం లేదని అనిశా గుర్తించింది. కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో వంద కోట్లు ఏమయ్యాయి... ఇందులో కార్మిక శాఖ అధికారుల పాత్ర ఏమిటనే విషయాలపై ఏసీబీ లోతుగా ఆరా తీస్తోంది.
ఇవీ చూడండి: ఈఎస్‌ఐ మందుల కొను"గోల్మాల్"..!