అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌ను(ICC Test Rankings) ప్రకటించింది. ఇందులో టీమ్ఇండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ(test rankings rohit sharma) కెరీర్ అత్యుత్తమ ర్యాంకును అందుకున్నాడు. సారథి కోహ్లీని దాటి 773 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచి ఈ మార్క్‌ను అందుకున్నాడు. విరాట్(icc test rankings virat kohli) ఒక స్థానం కోల్పోయి.. ఆరో ర్యాంకుకు పరిమితమయ్యాడు. ఇక ఇంగ్లాండ్ సారథి జో రూట్(joe root icc ranking) తన అద్భుత ప్రదర్శనతో అగ్రస్థానానికి(916 పాయింట్లు) చేరుకున్నాడు. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఘనతను సాధించాడు. దీంతో తొలి ర్యాంకులో ఉన్న కేన్ విలియమ్సన్ రెండో స్థానానికి పరిమితమయ్యాడు.
మొత్తంగా బ్యాటింగ్ విభాగంలో మూడు, నాలుగు స్థానాల్లో ఆస్ట్రేలియా ప్లేయర్స్ స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ నిలవగా.. ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని వార్నర్ ఎనిమిదో ర్యాంకుకు చేరుకున్నాడు.
బౌలింగ్ విభాగంలో టీమ్ఇండియా ప్లేయర్స్ రవిచంద్రన్ అశ్విన్(839 పాయింట్లు) తన రెండో స్థానాన్ని కాపాడుకోగా.. బుమ్రా(758 పాయింట్లు) పదో ర్యాంకును అందుకున్నాడు. ఇక ఒకటి, మూడు, నాలుగు ర్యాంకుల్లో ప్యాట్ కమిన్స్(908 పాయింట్లు), టిమ్ సౌథీ(824), జోష్ హెజిల్వుడ్(816) ఉన్నారు. ఇక ఇంగ్లాండ్ ఆటగాడు జేమ్స్ అండర్సన్ ఐదో ర్యాంకులో నిలిచాడు.
ఆల్‌రౌండర్ విభాగంలో భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా(343 పాయింట్లు), రవిచంద్రన్ అశ్విన్(338) తన ర్యాంకులను పదిలపరుచుకున్నారు. తొలి రెండు స్థానాల్లో జాసన్ హోల్డర్(వెస్టిండీస్, 434), బెన్‌స్టోక్స్(ఇంగ్లాండ్, 355) ఉన్నారు.
ఇదీ చూడండి: దాదాతో మనస్పర్థలు.. స్పందించిన రవిశాస్త్రి