Employees Agitation: తమ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో... ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు ఏపీవ్యాప్తంగా రెండోరోజు నిరసనలు కొనసాగుతున్నాయి. పీఆర్సీ, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ఆవరణలో ఏపీ ఉద్యోగుల జేఎసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు.
ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపుమేరకు ఏపీవ్యాప్తంగా రెండోరోజు నిరసన చేపట్టారు. 2018లో రావాల్సిన పీఆర్సీని ఇప్పటికి అమలు చేయలేదని ఉద్యోగులు మండిపడ్డారు. ప్రభుత్వం పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. లేపక్షంలో జనవరి 6 వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని జేఎసీ నాయకులు తెలిపారు.
విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్ హాలులో ఎన్జీవోల సమావేశం..
Employees JAC Meet At Vijayawada: విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్ హాలులో ఎన్జీవోల సమావేశమయ్యారు. ఏపీలోని 13 జిల్లాల నుంచి వచ్చిన 70 ఎన్జీవో సంస్థల నేతలు..ఎన్జీవోలు చేస్తున్న కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యచరణపై చర్చించినట్లు సమచారం. సమావేశంలో టిడ్కో, మెప్మా, ఖాదీ శాఖ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
Piyush Goyal on Paddy Procurement: 'ఒప్పందం మేరకే కొంటాం... ఎందుకు రాజకీయం చేస్తున్నారు?'