ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయిన ఉద్యోగులు.. తమ సమస్యల పరిష్కారానికి సుప్రీంను ఆశ్రయించారు. కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ వేశారు. జులై 14న సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం పోస్టింగ్ ఇవ్వలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఆగస్టులో ఈ ఉద్యోగులంతా ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయ్యారు.
దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం డివిజన్ బెంచ్.. డిసెంబర్ 3లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. అఫిడవిట్ వేయకపోతే ప్రతివాదులంతా డిసెంబర్ 8న కోర్టుకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇదీచూడండి: ఐఏఎస్ పదవికి సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా.. తెరాసలో చేరే అవకాశం