ETV Bharat / city

సమస్యలు పరిష్కరించాలంటూ విద్యుత్​ కార్మికుల మౌన దీక్ష - hyderabad news

రాష్ట్ర విద్యుత్​ ఉద్యోగుల సంఘం ధర్మ పోరాట మౌన దీక్ష చేపట్టింది. విద్యుత్​ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. ఉద్యోగులను క్రమబద్ధీకరించినట్లు ప్రకటించినా... ఇప్పటివరకు ఎటువంటి లాభం చేకూరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

electricity employees protest in hyderabad

author img

By

Published : Oct 2, 2020, 6:08 PM IST

విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ... రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల సంఘం హైదరాబాద్​లో ధర్మ పోరాట మౌన దీక్ష చేపట్టింది. ఉద్యోగులను క్రమబద్ధీకరించినట్టు సంస్థ యాజమాన్యం ప్రకటించినప్పటికీ... ఇప్పటి వరకు ఎటువంటి లబ్ధి చేకూరలేదని సంఘం అధ్యక్షుడు నాగరాజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

మిగిలిపోయిన 6500 మీటర్‌ రీడర్లు, స్టోర్‌ హమాలీలు, ఏపీటీఎస్‌ విజిలెన్స్‌, సెక్యురిటీ గార్డులకు వేతనాలతో కూడిన ఇపీఎఫ్‌, ఇఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: 'ఓ బాపూ నువ్వే రావాలి.. నీ సాయం మళ్లీ కావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.