ETV Bharat / city

విద్యుత్తు బకాయిదారులు భారీగా పెరిగారు..!

కొవిడ్ ప్రభావం వాణిజ్యం, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, కోచింగ్ కేంద్రాలు, వర్కింగ్ హాస్టళ్లు, క్యాటరింగ్ సెంటర్లు, థియేటర్లన్నింటిపైనా పడింది. లాక్​డౌన్​ వల్ల తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన ఈ రంగాలు.. నిబంధనలు సడలించినా పూర్తిగా తేరుకోలేపోయాయి. రోజువారీ వాణిజ్య కార్యకలాపాలు సాఫీగా సాగకపోవడం వల్ల విద్యుత్ బిల్లులు కట్టలేక భారీగా బకాయిపడ్డారు.

electricity arrears in Telangana is increased
తెలంగాణలో పెరిగిన విద్యుత్ బకాయిదారులు
author img

By

Published : Jan 16, 2021, 10:02 AM IST

కరోనా వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీసింది. లాక్‌డౌన్‌ అనంతరం పునఃప్రారంభమైనా వ్యాపారాలు లేక నిర్వహణ ఖర్చులు భారంగా మారాయి. రోజువారీ వాణిజ్య కార్యకలాపాలు మందకొడిగా ఉండటంతో కరెంట్‌ బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో వినియోగదారులు విద్యుత్తు పంపిణీ సంస్థకు బకాయిపడ్డారు. వాణిజ్యం, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, చిన్న పాఠశాలలు, కోచింగ్‌ కేంద్రాలు, వర్కింగ్‌ హాస్టళ్లు, క్యాటరింగ్‌ సెంటర్లు, థియేటర్లను కోలుకోలేని దెబ్బతీసింది.

కొవిడ్‌కు ముందు ఫిబ్రవరి నెలతో పోలిస్తే 2020 ఏడాది నవంబరు నాటికి ప్రతి సర్కిల్‌లో విద్యుత్తు బకాయిదారులు భారీగా పెరిగారు. ఐటీ విద్యుత్తు డిమాండ్‌ తగ్గడం, బిల్లులు వసూళ్లు కాకపోవడంతో కొవిడ్‌ కారణంగా డిస్కం రూ.3 వేల కోట్ల రూపాయాల ఆదాయాన్ని కోల్పోయింది.

గ్రేటర్‌ పరిధిలో 51 లక్షలకుపైగా విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. ఏటా కొత్తగా రెండు లక్షల వరకు విద్యుత్తు కనెన్షన్లు జారీ చేస్తుంటారు. కొవిడ్‌తో కొత్త కనెన్షన్లకు మునుపటి మాదిరి డిమాండ్‌ లేదు. ఇప్పటికే ఉన్న కనెన్షన్లలో గతంలోకంటే ఎక్కువ మంది బకాయిపడ్డారు.

సాధారణంగా ప్రతినెలా 10 లక్షల కనెన్షన్లలో బకాయిలుంటాయి. కొవిడ్‌తో బకాయిలు మరింత పెరిగి సంఖ్య 15 లక్షలకు పెరిగింది. ఉపాధి కోల్పోయి చాలా ఇళ్లు నగరంలో ఖాళీ అయ్యాయి. చిన్న ఉద్యోగులు ఊళ్లకు వెళ్లిపోయారు. ఇంటి నుంచి పనిచేస్తుండటంతో ఐటీ కారిడార్‌ బోసిపోసి కన్పిస్తోంది. వీరిపై ఆధారపడిన హోటళ్లు, హాస్టళ్లు, క్యాటరింగ్‌ సెంటర్లు, సర్వీస్‌ అపార్ట్‌మెంట్లు అన్ని ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వ్యాపారం లేక కనీస కరెంట్‌ బిల్లులు కూడా చెల్లించలేక చాలా సంస్థలు బకాయిపడ్డాయి.

అంతక్రితంతో పోలిస్తే ఈ ఆరునెలల కాలంలో సైబర్‌సిటీలో బకాయిపడిన విద్యుత్తు కనెన్షన్లు దాదాపు 50 వేలు పెరిగాయి. పాతబస్తీలో పెరిగిన బకాయిదారుల సంఖ్యనే 80 వేల వరకు ఉంది. వాణిజ్య, పరిశ్రమలతోపాటూ ఉపాధి కోల్పోవడంతో గృహ బకాయిలు పెరిగాయని.. అందుకే సంఖ్య భారీగా పెరిగిందని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ డీఈ ప్రస్తుత పరిస్థితిని విశ్లేషించారు. ఇప్పటికీ మూతపడిన వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు తెరిస్తే తప్ప వారి నుంచి బకాయిలు వచ్చే అవకాశం లేదు.

డిమాండ్‌ ఛార్జీలపై నివేదిక

‘డిస్కం కరెంట్‌ కొనుగోలు చేసి వినియోగదారులకు సరఫరా చేస్తోంది. యూనిట్‌కు అయ్యే వ్యయాన్ని లెక్కించి టారిఫ్‌ రూపంలో వసూలు చేస్తున్నాం. వినియోగదారుడికి రాయితీ ఇస్తే ఆ మొత్తాన్ని ప్రభుత్వాన్ని చెల్లించాల్సి ఉంటుంది. డిమాండ్‌ ఛార్జీలపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించాం. సీఎంతో చర్చించాక ఈఆర్‌సీ అనుమతితో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కొవిడ్‌ కారణంగా డిస్కం ఇప్పటికే రూ.3 వేల కోట్ల ఆదాయం కోల్పోయింది’ అని అధికారి ఒకరు తెలిపారు.

లెక్కలు సిద్ధం

జీహెచ్‌ఎంసీతోపాటూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు, ఇతర వ్యాపార సంస్థల ఎల్టీ కేటగిరి విద్యుత్తు కనెక్షన్లకు సంబంధించిన కనీస డిమాండ్‌ ఛార్జీలను మార్చి నుంచి సెప్టెంబరు వరకు రద్దు చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్‌, మే నెలలో పూర్తిగా లాక్‌డౌన్‌ కావడంతో అత్యవసర విభాగాలు తప్ప అన్ని మూతపడ్డాయి. కనీస డిమాండ్‌ ఛార్జీలు చెల్లించాల్సి రావడం ఎక్కువ సంస్థలకు భారంగా మారింది.

ఉదాహరణకు ఒక పరిశ్రమలో 100 కేవీఏ కాంట్రాక్ట్‌ లోడ్‌ సామర్థ్యం కలిగిన విద్యుత్తు కనెన్షన్‌ ఉంటే.. వాడినా వాడకపోయినా ఇందులో 80 శాతం కాంట్రాక్ట్‌లోడ్‌కు కనీస డిమాండ్‌ ఛార్జీలు చెల్లించాలి. ఒక కేవీఏకి హెచ్‌టీలో రూ.395 వసూలు చేస్తారు. ఆ రకంగా దాదాపు రూ.32 వేలు కనీస డిమాండ్‌ ఛార్జీలే ఉంటాయి. వీటిని తీసేసి వాడిన మేరకే కరెంట్‌ ఛార్జీలు అని ప్రభుత్వం చెప్పడంతో డిస్కం ఇప్పటికే దీనిపై కసరత్తు చేసింది. వినియోగదారులకు తగ్గే భారం ఎంతనేది లెక్కలు సిద్ధమయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.