ETV Bharat / city

'తెరాసలో ఏక్‌నాథ్‌ శిందేలు చాలా మంది ఉన్నారు.. వారిలో ఎవరైనా కావొచ్చు' - కేసీఆర్​పై బండి సంజయ్

తెరాసలో కూడా చాలా మంది ఏక్​నాథ్​ శిందేలు ఉన్నారన్నారు భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ఆ పార్టీలో ఏదో అలజడి జరుగుతోందన్నారు. ప్రభుత్వ అవినీతిని పక్కదారి పట్టించేందుకే సీఎం కేసీఆర్​ భాజపాపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు.

బండి సంజయ్
బండి సంజయ్
author img

By

Published : Jul 11, 2022, 3:02 AM IST

ప్రభుత్వ అవినీతిని తప్పుదారి పట్టించేందుకు సీఎం కేసీఆర్‌ భాజపాను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే హక్కు కేసీఆర్‌కు లేదని కేసీఆర్​కు మోదీకి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. మోదీ పరిపాలనను గతంలో కేసీఆర్ పొగిడిన మాట వాస్తవం‌ కాదా అని బండి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ప్రశ్నలకు మొదట కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో కేసీఆర్‌ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఆర్ధిక వ్యవస్థను శక్తిమంతంగా తయారు చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ వంటి వారి ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసిన సంగతి దేశ ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ కుటుంబ పాలన అంతం కాక తప్పదన్నారు. కేసీఆర్​కు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలా అని ప్రశ్నించారు. బీసీ నాయకుడు లక్ష్మణ్​పై కేసీఆర్ వ్యాఖ్యలను బండి ఖండించారు.

తెరాసలో ఏదో అలజడి జరుగుతోందని ఆ పార్టీలో ఏక్​నాథ్ షిండేలు చాలా మంది ఉన్నారని అందుకే కేసీఆర్‌కు భయం పట్టుకుందని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. కేసీఆర్ అల్లుడు, కొడుకు, బిడ్డల్లో ఎవరైనా ఏక్​నాథ్​ షిండేలు కావొచ్చన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో కేసీఆర్‌ ప్రభుత్వం ఉందని.. అనేక సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయని వీటిపై తెలంగాణ ప్రజల ప్రశ్నలకు మొదట కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. మోదీ పరిపాలనను గతంలో కేసీఆర్ పొగిడిన మాట వాస్తవం‌ కాదా అని ప్రశ్నించారు. జోగులాంబ అమ్మవారిని కించపర్చిన కేసీఆర్ కుటుంబం రాజకీయంగా సమాధి కావటం‌ ఖాయమన్నారు. సీఎం స్థాయిలోని కేసీఆర్ సంస్కారహీనమైన భాష మాట్లాడటం వల్ల తెలంగాణ సమాజం సిగ్గుతో తల దించుకుంటోందన్నారు. తెలంగాణలో ఓవైపు భాజపా గ్రాఫ్ వేగంగా పెరుగుతుంటే.. తెరాస గ్రాఫ్ అంతే వేగంగా పడిపోతోందని పేర్కొన్నారు. ఆ ఒత్తిడి వల్లే ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని పరిస్థితిలో సీఎం ఉన్నారని బండి సంజయ్‌ అన్నారు.

ఇదీ చూడండి : 'తెలంగాణ సర్కార్​ ఇంజిన్​ సూపర్​ స్పీడ్​.. చేతకాని భాజపా మాకెందుకు..?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.