ETV Bharat / city

యూకే మహిళతో రైల్లో వచ్చిన వారిని గుర్తించిన అధికారులు

author img

By

Published : Dec 26, 2020, 2:56 PM IST

యూకే నుంచి కరోనా పాజిటివ్‌తో ఏపీలోని రాజమహేంద్రవరానికి వచ్చిన ఓ మహిళతో ఏపీ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో ప్రయాణించిన ఎనిమిది మందిని అధికారులు గుర్తించారు. వీరందరి స్వాబ్‌ నమూనాలు సేకరించి శుక్రవారం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా కొవిడ్‌ నెగిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌ వెల్లడించారు.

eight-people-on-the-ap-express-got-kovid-negative
యూకే మహిళతో రైల్లో వచ్చిన వారిని గుర్తించిన అధికారులు

యూకే నుంచి కరోనా పాజిటివ్‌తో ఏపీలోని రాజమహేంద్రవరానికి వచ్చిన ఓ మహిళతో ఏపీ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో ప్రయాణించిన విశాఖ వాసులు ఎనిమిది మందిని గుర్తించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ముగ్గురు అనకాపల్లిలోని ఓ లాడ్జిలో ఉండగా గుర్తించారు. ఒకరిది మన్యం ప్రాంతం. మిగిలిన వారిలో ఇద్దరు నగరంలోని వైద్యుల కుటుంబీకులు. వీరందరి స్వాబ్‌ నమూనాలు సేకరించి శుక్రవారం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా కొవిడ్‌ నెగిటివ్‌ నిర్ధరణ అయినట్లు ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌ వెల్లడించారు. కొత్త రకం వైరస్‌ ప్రభావం వీరిపై ఉందా అనేది తేల్చేందుకు పుణేలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆఫ్‌ వైరాలజీ ప్రయోగశాలకు వీరి నమూనాలు పంపాల్సిన అవసరం లేదని భావించారు. అయితే అందరినీ విశాఖ కేజీహెచ్‌లోని క్వారంటైన్‌కు తరలించారు.

వీరిని ఇక్కడే ఉంచాలా, హోం క్వారంటైన్‌కి పంపాలా అన్న అంశాన్ని జిల్లా కలెక్టర్‌ నిర్ణయిస్తారన్నారు. కాగా జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు కొత్తగా 28 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని డాక్టర్‌ సుధాకర్‌ తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 58,718 మంది డిశ్చార్జి అయ్యారన్నారు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో 284 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు.

అధికారులు అప్రమత్తం

ఇంగ్లాండ్​లో కరోనా కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రావటంతో ఏపీ ఎన్నార్టీఎస్ అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా ఆంక్షలు సడలించిన తర్వాత ఇంగ్లాండ్ నుంచి ఆంధ్రప్రదేశ్​కు వచ్చిన వారి వివరాలను సేకరించి వైద్యశాఖకు అందజేశారు. యూకేతో పాటు మరో మూడు గల్ఫ్ దేశాలు కొన్ని రోజులపాటు విమాన రాకపోకలు నిలిపివేశాయని ఏపీఎన్నార్టీఎస్ అధికారులు చెపుతున్నారు. యూకే నుంచి వచ్చే వారి వివరాల సేకరించటంతో పాటు... కాల్​ సెంటర్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: రాబోయే రెండు రోజులు బీ అలర్ట్​.. పెరగనున్న చలి తీవ్రత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.