Schools Reopen: విద్యాసంస్థల పునః ప్రారంభం.. నేటి నుంచే నూతన విద్యా విధానం - రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు పునః ప్రారంభం
ఏపీలో ఈ రోజు నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యాయి. కరోనా నిబంధలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని ఆయ విద్యాసంస్థలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విద్యావ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా నేటి నుంచి రాష్ట్రంలో నూతన విద్యా విధానం అమలు కానుంది.
![Schools Reopen: విద్యాసంస్థల పునః ప్రారంభం.. నేటి నుంచే నూతన విద్యా విధానం Schools Reopen in ap](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12786295-533-12786295-1629091265702.jpg?imwidth=3840)
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యాయి. ఒకటి నుంచి 10వ తరగతి, ఇంటర్ రెండో ఏడాది తరగతులు ప్రారంభమయ్యాయి. గదుల కొరత ఉన్న విద్యా సంస్థల్లో రెండు విడతలుగా తరగతులు నిర్వహించనున్నారు. అన్ని పాఠశాలల్లో కరోనా నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పాఠశాలల్లో మాస్కు, భౌతికదూరం, థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి చేసింది.
నేటి నుంచి నూతన విద్యా విధానం..
పాఠశాల విద్యలో నేటి నుంచి నూతన విద్యా విధానం అమలు చేయనున్నారు. పాఠశాల విద్యావ్యవస్థ ఆరు విభాగాలుగా మారనుంది. పూర్వ ప్రాథమిక విద్య 1, 2 శాటిలైట్ ఫౌండేషన్ బడులుగా మారనున్నాయి. ప్రీ ప్రైమరీ 1,2 సహా ఒకటి, రెండు తరగతులు ఉంటే ఫౌండేషన్, 1 నుంచి 5 తరగతులు ఉంటే ఫౌండేషన్ ప్లస్‌గా మారనున్నాయి. 3 నుంచి 8వ తరగతి వరకు ఉంటే ప్రీ హైస్కూళ్లు, 3 నుంచి 10వ తరగతి వరకు ఉంటే ఉన్నత పాఠశాలలు, 3 నుంచి 12 వరకు ఉంటే హైస్కూల్ ప్లస్‌గా మారనున్నాయి.
ఇదీ చదవండి: PRC: 'పీఆర్‌సీ'ని బేరానికి పెట్టిన క్లర్కులు.. కార్మికుల నుంచి వసూలు!