కరోనా మహమ్మారి నియంత్రణకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ కొండాపూర్లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో కొవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై వైద్య అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో ఎలాంటి మౌలిక సదుపాయాలు, బెడ్లు, ఆక్సిజన్ కొరత లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆస్పత్రికి వచ్చిన పలువురు బాధితులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ప్రజలు కరోనా మహ్మమరి బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కోరారు. ఆక్సిజన్ అందడం లేదని, మౌలిక వసతులు లేవని ప్రజలు భయబ్రాంతులకు చెందకుండా ప్రభుత్వ ఆసుపత్రిల్లో చేరాలని సూచించారు. కొండాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో 110 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొండాపూర్ ఆసుపత్రి పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారిగా శేరిలింగంపల్లి తహసీల్దార్ వంశీ మెహన్ను నియమించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, జిల్లా ఆసుపత్రి సుపరింటెండెంట్ దశరథ, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు.