vacancies in higher education: ఉన్నత విద్యా శాఖలో ప్రత్యక్ష నియామకం కింద భర్తీ చేసేందుకు 5,083 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ గుర్తించింది. గ్రూప్-4 కింద భర్తీ చేసే పోస్టులను మినహాయించగా.. ఈ ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. వీటి భర్తీని సత్వరమే నోటిఫై చేయాలని ప్రభుత్వానికి దస్త్రం పంపించింది. వాటిలో యూనివర్సిటీల్లోనే అత్యధికంగా 1,892 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించింది. ఖాళీలు ఇలా ఉన్నాయి ..
ఇంటర్మీడియట్ కమిషనరేట్ (1,523)
- జూనియర్ లెక్చరర్: 1392
- ఫిజికల్ డైరెక్టర్: 91
- లైబ్రేరియన్: 40
కళాశాల విద్య కమిషనరేట్ (546)
- లెక్చరర్: 491
- ఫిజికల్ డైరెక్టర్: 29
- లైబ్రేరియన్: 24
- జూనియర్ అసిస్టెంట్: 2
సాంకేతిక విద్య కమిషనరేట్ (568)
- లెక్చరర్: 247
- ఫిజికల్ డైరెక్టర్: 37
- లైబ్రేరియన్: 31
- జూనియర్ అసిస్టెంట్: 12
- జూనియర్ ఇన్‌స్ట్రక్టర్: 14
- ఎలక్ట్రీషియన్: 25
- మాట్రన్: 5
- ల్యాబ్ అటెండర్: 197
11 యూనివర్సిటీలు (2374)
- బోధన సిబ్బంది: 1892
- బోధనేతర సిబ్బంది: 482
- ఇంటర్మీడియట్ బోర్డు- జూనియర్ అసిస్టెంట్: 52
- తెలంగాణ ఆర్కైవ్స్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్: 20
ఇదీ చదవండి: తెలంగాణలో మరో సంస్థ భారీ పెట్టుబడులు.. ఎన్ని కోట్లో తెలుసా?