ట్రాన్స్‌ట్రాయ్ ద్వారా నిధులు మళ్లించారన్న అభియోగంపై... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై.. ఈడీ కేసు నమోదు చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం యూనియన్ బ్యాంక్ నుంచి ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ.. 500 కోట్లు రుణం తీసుకుంది. ఆ రుణం చెల్లించకపోవటంతో బ్యాంకు అధికారులు సీబీఐకు ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదు మేరకు... రెండు రోజుల క్రితం సీబీఐ అధికారులు రాయపాటి ఇంట్లో తనిఖీలు చేశారు. అనంతరం ఈ వ్యవహారంపై దృష్టి పెట్టిన ఈడీ అధికారులు... తీసుకున్న రుణాలను ట్రాన్స్‌ట్రాయ్ ద్వారా విదేశాలకు నిధులు మళ్లించారన్న అభియోగం కింద కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి: ఈఎస్ఐ కేసు: తవ్వే కొద్దీ వెలుగులోకి కొత్త విషయాలు..!