ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ పక్రియలో నెలకొన్న హింసాత్మక చర్యలను రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. కొన్నిచోట్ల బెదిరింపులు, దౌర్జన్యాలకు దిగడం దారుణమని వ్యాఖ్యానించింది. విధుల్లో విఫలమైన పలువురు అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను తప్పిస్తున్నట్లు వెల్లడించింది. శ్రీకాళహస్తి, పలమనేరు, డీఎస్పీలను బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. మాచర్ల సీఐను సస్పెండ్ చేయాలని... తిరుపతి, పలమనేరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలు బదిలీ చేయాలని సూచించింది. తిరుపతి, మాచర్ల, పుంగనూరు ఘటనలను నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. అవసరమైతే ఈ ప్రాంతాల్లో కొత్త షెడ్యూల్ను ప్రకటిస్తామని తెలిపింది.
ఇదీ చూడండి: కరోనా హెల్ప్లైన్లు.. అందుబాటులో నంబర్లు