ఏమిటి ఈ-స్పోర్ట్స్?
ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఆడే గేమ్స్ ఈ-స్పోర్ట్స్. ఇందులో పబ్జీ , ఢిపెన్స్ ఆఫ్ ది అన్షియేట్ లీగ్ ఆఫ్ లెజెండ్స్, కంట్రీ స్ట్రైక్, కాల్ ఆఫ్ డ్యూటీ, పిపా, స్టార్ క్రాఫ్ట్ తదితర ఆటలు ఉంటాయి. వినోదం కోసం ఆడే ఆటలను ఫాంటసీ వీడియో గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ అని సంభోదిస్తుంటారు. రెండింటిలో మల్లీ ప్లేయర్స్, ఆన్లైన్ ఆటలు ఉంటాయి.
దూసుకొస్తున్న స్టార్టప్‌లు
దేశ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా ఈ-స్పోర్ట్స్ ట్రెండ్ పెరుగుతోంది. కొన్నేళ్లుగా ఈ రంగంలో స్టార్టప్‌లు వస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇటీవలి కాలంలో పలు కంపెనీలు టీమ్ లను ఎంచుకుంటున్నాయి. గేమింగ్ సంబంధించిన పరికరాల ప్రదర్శనలూ నిర్వహిస్తున్నారు.
నివేదికలు ఏం చెపుతున్నాయి....?
ఐఎఫ్ఎస్జీ-కేపీఎమ్‌జీ నివేదిక ప్రకారం, ప్రస్తుతం ఈ-స్పోర్ట్స్ మార్కెట్ మన దేశంలో రూ. 4,380 కోట్లుగా ఉంది. ఇది 22.1 వార్షిక వృద్ధి రేటుతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 11,880 కోట్లకు చేరుతుందని ఆ నివేదిక అంచనా వేసింది. భారతదేశం మొబైల్ గేమింగ్‌లో టాప్ 5 దేశాల్లో ఉంది. అయితే ఈ-స్పోర్ట్స్‌లో మాత్రం వాటా చాలా తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
టోర్నమెంట్లు...
అంతర్జాతీయ స్థాయిలో ఈ-స్పోర్ట్స్ టోర్నమెంట్లు తరచూ జరుగుతుంటాయి. భారత్‌లో ఈ-స్పోర్ట్స్ ప్రొత్సహించేందుకు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా 2007లో ఏషియన్ ఇండోర్ గేమ్స్‌లో వీటిని చేర్చింది. గత 9 ఏళ్లలో భారత్‌లో ఈ-స్పోర్ట్స్ తయారు చేస్తోన్న కంపెనీల సంఖ్య 250కి పైగా పెరగడం విశేషం. పేటియం, అలీబాబా, టెన్సెంట్ లాంటి దిగ్గజ కార్పొరేట్లు గేమింగ్ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అంతే కాకుండా ఇందులో కోడింగ్, డాటా హ్యాండిలర్, గేమ్ కామెంటేటర్ ఉద్యోగులకు నెలకు రూ.50వేల నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు. ఈ క్రమంలో భారత్‌లో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోన్న ఈ-స్పోర్ట్స్‌లో యువత ఫ్రొపెషనల్ గేమర్స్గా తయారైతే మంచి భవిష్యత్ ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవీ చూడండి: లండన్ వీడియో గేమ్ ఫెస్ట్ కు వెళ్తారా?