ETV Bharat / city

డిప్యూటీ స్పీకర్ కోలగట్లకు 400కార్లు, 2000వేలకు పైగా ద్విచక్రవాహనాలతో ర్యాలీ

author img

By

Published : Sep 25, 2022, 9:15 PM IST

Deputy Speaker Kolagatla In Vizianagaram: డిప్యూటీ స్పీకర్ హోదాలో తొలిసారిగా ఏపీ విజయనగరంలో అడుగుపెట్టిన కోలగట్ల వీరభద్రస్వామికి వైకాపా శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. హెలికాప్టర్‌ ద్వారా పూలు జల్లి అభిమానాన్ని చాటుకున్నారు. సుమారు 400కార్లు, 2000వేలకు పైగా ద్విచక్రవాహనాలతో ర్యాలీ నిర్వహించారు.

Deputy Speaker Kolagatla
Deputy Speaker Kolagatla

Deputy Speaker Kolagatla In Vizianagaram: డిప్యూటీ స్పీకర్ హోదాలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్​ విజయనగరంలో అడుగుపెట్టిన కోలగట్ల వీరభద్రస్వామికి వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. కోలగట్ల తాజాగా శాసనసభ ఉప సభాపతి పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. హెలికాప్టర్ ద్వారా పై నుంచి పూలుజల్లుతూ వీరభద్రస్వామికి ఘనస్వాగంతం పలికారు. మరోవైపు 400కార్లు, 2000 ద్విచక్ర వాహనలతో ర్యాలీ నిర్వహించారు.

మంగళ వాయిద్యాలతో వివిధ కళా రూపాలతో కోలగట్ల వీరభద్రస్వామికి స్వాగతం చెప్పారు. విజయనగరంలోని చెల్లూరు నుంచి వై జంక్షన్​ , రైల్వే స్టేషన్ రోడ్డు, కన్యకాపరమేశ్వరి దేవాలయం, మూడు లాంతర్లు, సింహచలం మేడ.. నగరంలోని వివిధ ప్రాంతాల మీదుగా కోలగట్ల నివాసం వరకు భారీ కాన్వాయ్​తో కోలాహలంగా ర్యాలీ నిర్వహించారు. రహదారి ప్రధాన కూడళ్లలో హెలికాప్టర్ ద్వారా పూలజల్లు కురిపించారు.

విజయనగరం జిల్లా ప్రారంభం నుంచి కోలగట్ల నివాసం వరకు సుమారు నాలుగు గంటల పాటు భారీ కాన్వాయ్​తో స్వాగత ర్యాలీ కొనసాగింది. దీంతో విశాఖ, విజయనగరం, ఒడిశా మార్గంతో పాటు ప్రధాన మార్గాల మీదుగా ర్యాలీ సాగడంతో.. వాహనదారులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామికి ఘనస్వాగతం పలికిన వైకాపా శ్రేణులు

ఇవీ చదవండి: 'ఇక్కడి నాయకులు ఫార్మా కంపెనీ యాజమాన్యాలకు అమ్ముడుపోయారు'

137 ఏళ్లలో మూడు సార్లే అధ్యక్ష ఎన్నికలు.. ఈసారి సరికొత్త లెక్క.. పార్టీ పరిస్థితి మారేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.