ETV Bharat / city

'ఈసారి గవర్నర్‌ ప్రసంగం ఉండదు.. అవమానించే ఉద్దేశం మాకు లేదు' - తెలంగాణ గవర్నర్​ బడ్జెట్ స్పీచ్​

Ministers on Governor Speech: మహిళా గవర్నర్‌ను అవమానించామన్న భాజపా నేతల వ్యాఖ్యలను మంత్రులు హరీశ్​రావు, వేముల ప్రశాంత్​ రెడ్డి ఖండించారు. గవర్నర్‌ను అవమానించే ఉద్దేశం లేదన్నారు. గతంలోనూ గవర్నర్‌ ప్రసంగం లేకుండా బడ్జెట్‌ సమావేశాలు జరిగాయని గుర్తు చేశారు.

ts ministers
ts ministers
author img

By

Published : Mar 1, 2022, 3:33 PM IST

'ఈసారి గవర్నర్‌ ప్రసంగం ఉండదు.. అవమానించే ఉద్దేశం మాకు లేదు'

Ministers on Governor Speech : భాజపా నేతలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని మంత్రులు హరీశ్‌ రావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆరోపించారు. మహిళా గవర్నర్‌ను అవమానించామన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. గవర్నర్‌ను అవమానించే ఉద్దేశం లేదన్న మంత్రులు... గతంలోనూ గవర్నర్‌ ప్రసంగం లేకుండా బడ్జెట్‌ సమావేశాలు జరిగాయని వెల్లడించారు. రాష్ట్రపతి ప్రసంగం లేకుండానే 2004లో పార్లమెంట్‌ సమావేశాలు జరిగాయని వివరించారు. శాసన సభ ప్రొరోగ్‌ కానందునే గవర్నర్‌ ప్రసంగం ఉండదన్న మంత్రులు....గతంలో అధికార పక్ష సభ్యల కంటే విపక్షాలకే ఎక్కువ సమయం కేటాయించినట్లు శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు.

బండి సంజయ్‌కి నైతిక అర్హత

'బండి సంజయ్‌ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. మహిళా గవర్నర్‌ను అవమానించామన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. అసోం సీఎం హేమంత్‌ మాతృమూర్తులను అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. హేమంత్‌ బిశ్వాస్‌ వ్యాఖ్యలను బండి సంజయ్‌ సమర్థించారు. బండి సంజయ్‌కు మహిళలపై మాట్లాడే నైతిక అర్హత లేదు. గవర్నర్‌ను అవమానించే ఉద్దేశం మాకు లేదు.' - హరీశ్‌రావు

గవర్నర్‌ను పిలిస్తే తప్పు

గతంలోనూ గవర్నర్‌ ప్రసంగం లేకుండా బడ్జెట్‌ సమావేశాలు జరిగాయని మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి తెలిపారు. 1970 డిసెంబర్‌, 1971 మార్చి, 2013 ఫిబ్రవరి, 2020 బడ్జెట్‌ సమావేశంలో గవర్నర్‌ ప్రసంగం లేదని వివరించారు. ప్రొరోగ్‌ కాని సమావేశాలకు గవర్నర్‌ను పిలిస్తే తప్పని పేర్కొన్నారు. అభివృద్ధిలో తెలంగాణ ప్రథమంగా ఉందని కేంద్ర గణాంకాలే చెబుతున్నాయని స్పష్టం చేశారు.

గవర్నర్‌ ప్రసంగం లేకుండానే

'తెలంగాణ అభివృద్ధిని గవర్నర్‌ ప్రసంగం ద్వారా చెప్పించాలనే అనుకుంటాం. సాంకేతిక సమస్య కారణంగా ఈసారి గవర్నర్‌ ప్రసంగం ఉండదు. కాసు బ్రహ్మానందరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గవర్నర్‌ ప్రసంగం లేకుండానే సమావేశాలు జరిగాయి. సభ ప్రొరోగ్‌ కానందునే గవర్నర్‌ ప్రసంగం ఉండదు. రాష్ట్రపతి ప్రసంగం లేకుండానే 2004లో పార్లమెంట్‌ సమావేశాలు జరిగాయి.' - వేముల ప్రశాంత్​ రెడ్డి

ఇదీ చదవండి : గవర్నర్ కుర్చీని సీఎం కేసీఆర్​ అవమానించారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.