ETV Bharat / city

నిరీక్షణకు తెరదించే 'పొడి' పరీక్ష!

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ.. బాధితులు ఆర్టీపీసీఆర్‌ పరీక్షకు వచ్చినప్పటి నుంచి ఫలితం తేలేదాకా తీవ్రమైన నిరీక్షణ, ఖర్చు తప్పడం లేదు. నమూనా తరలింపులో వైద్య సిబ్బందికి వైరస్‌ వ్యాప్తి రూపంలో ముప్పు ఉండడంతో వారికీ ఆందోళనగా ఉంటోంది. దీనికి పరిష్కారంగా హైదరాబాద్‌ సీసీఎంబీ శాస్త్రవేత్తలు ‘డ్రై స్వాబ్‌’ పరీక్షా విధానాన్ని అభివృద్ధి చేశారు. గత ఏడాది నవంబర్‌లో దీనికి ఐసీఎంఆర్‌ ఆమోదం దక్కినా క్షేత్రస్థాయిలో మాత్రం వాడడం లేదు.

corona tests
డ్రై స్వాబ్‌ పరీక్ష
author img

By

Published : May 4, 2021, 10:50 AM IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతుండడం, ప్రభుత్వ, ప్రైవేట్‌ ల్యాబ్‌లలో వేలసంఖ్యలో ఆర్‌టీపీసీఆర్‌ నమూనాలు పేరుకుపోతున్న నేపథ్యంలో సగానికిపైగా ఖర్చు, సమయాన్ని ఆదా చేసే ‘డ్రై స్వాబ్‌’ విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సీసీఎంబీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా త్వరలో దేశవ్యాప్తంగా 500 ప్రభుత్వ, ప్రైవేట్‌ ల్యాబ్‌ల సిబ్బందికి ఆన్‌లైన్‌ వేదికగా శిక్షణనివ్వనున్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.

ఏంటి తేడా..?

ప్రస్తుతం ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలో భాగంగా బాధితుల నుంచి సేకరించిన గొంతు, ముక్కు స్రావాల నమూనాలను వైరల్‌ ట్రాన్స్‌పోర్టు మీడియం (వీటీఎం) ద్రావణంలో ఉంచి ల్యాబ్‌కు తరలిస్తున్నారు. దీన్ని తరలించే సమయంలో ద్రావణం లీకేజీ ద్వారా ఫలితాల్లో తేడాలే కాకుండా వైద్య సిబ్బందీ వైరస్‌కు గురవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సమస్యను అధిగమించేందుకు సీసీఎంబీ డ్రైస్వాబ్‌ కిట్‌ను రూపొందించింది. పొడిగా ఉండే స్వాబ్‌ కిట్‌ ద్వారా నేరుగా ఆర్‌టీపీసీఆర్‌ చేసేయొచ్చు. ఆర్‌ఎన్‌ఏ వెలికితీసే సౌకర్యాలు లేని సాధారణ కేంద్రాల్లో ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అన్నీ ఆదా..!

ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల్లో స్వాబ్‌ ప్యాక్‌ చేసేందుకు, ల్యాబ్‌లో ఆర్‌ఎన్‌ఏ వేరు చేసేందుకు గంటల సమయం పడుతోంది. ఒక్కో పరీక్ష తేలేందుకు కనీసం 24 నుంచి 48గంటలు పడుతోంది. డ్రైస్వాబ్‌ ద్వారా ఆర్‌ఎన్‌ఏ వేరుచేయకుండా పరీక్ష చేయడంతో ఫలితం కేవలం కొద్ది గంటల్లోనే తేలుతుంది. ఖర్చు సగానికి సగం తగ్గుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొన్ని ప్రైవేట్‌ కేంద్రాల్లో ఈ పద్ధతిని వినియోగిస్తున్నారు.

500 కేంద్రాల సిబ్బందికి శిక్షణ!

దేశవ్యాప్తంగా భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) గుర్తింపు పొందిన ప్రైవేట్‌, ప్రభుత్వ పరీక్ష కేంద్రాల్లో 500 కేంద్రాల సిబ్బందికి ఈ డ్రై స్వాబ్‌ పద్ధతి పరీక్షపై సీసీఎంబీ శిక్షణనివ్వనుంది. ఆన్‌లైన్‌ వేదికగా జరిగే ఈ సెషన్స్‌ వినేందుకు http://e-portal.ccmb.res.in/dst_slotbooking లింకు ద్వారా నమోదు చేసుకోవాలని సీసీఎంబీ శాస్త్రవేత్తలు సూచించారు. హైదరాబాద్‌లో ఉన్నవారు సీసీఎంబీ డైరెక్టర్‌ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశముందని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌మిశ్ర తెలిపారు.

ఇవీచూడండి: రాష్ట్రానికి చేరిన 4 లక్షల డోసులు.. నేటి నుంచి యథావిధిగా పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.