ETV Bharat / city

అత్యవసర మందుల కొరత.. ఇదే అదనుగా అడ్డగోలు ధరలు - కరోనా మందుల ధరలు

కరోనా విజృంభిస్తోన్న వేళ... అత్యవసర ఔషధాల పేరిట అడ్డగోలుగా దోచుకుంటున్నారు. చికిత్సల్లో అందించాల్సిన ప్రాణాధార ఔషధాల పేరిట యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులే ఇందులో కీలకంగా వ్యవహరిస్తుండగా, మరికొందరు ఔషధ టోకు వ్యాపారులూ అడ్డగోలు వసూళ్లలో భాగస్వాములవుతున్నారు. వీటికి బిల్లులు కూడా ఇవ్వకుండా అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

coronavirus
coronavirus
author img

By

Published : Jul 13, 2020, 6:38 AM IST

ఖమ్మంలో ఒక వ్యాపారికి కరోనా సోకింది. లక్షణాలు తీవ్రమవ్వడంతో హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేర్చారు. ‘రెమిడెసివిర్‌ 100 ఎంజీ ఇంజక్షన్‌-2’ ‘టోసిలిజుమాబ్‌ 400 ఎంజీ ఐవీ ఇంజక్షన్‌-1’.. అవసరమని చెప్పి వైద్యుడు చీటీ రాసి ఇచ్చారు. రాజధానిలో పేరున్న ఏ ఔషధ దుకాణానికి వెళ్లినా ఆ మందులు లేవన్న సమాధానమే వచ్చింది. ఒక హోల్‌సేల్‌ దుకాణంలో గరిష్ఠ చిల్లర ధర(ఎంఆర్‌పీ) కంటే ఐదింతలు అధికంగా చెల్లించి కొన్నారు.

ఒకవైపు ప్రాణం నిలబెట్టుకోవాలనే ఆరాటం.. మరోపక్క ఆ బలహీన క్షణాన్నే సొమ్ము చేసుకోవాలనే స్వార్థం. వీటి మధ్య కరోనా రోగులు మానసికంగా నలిగిపోతున్నారు. ఆర్థికంగా చితికిపోతున్నారు. అత్యవసర చికిత్సల్లో అందించాల్సిన ప్రాణాధార ఔషధాల పేరిట యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులే ఇందులో కీలకంగా వ్యవహరిస్తుండగా, మరికొందరు ఔషధ టోకు వ్యాపారులూ అడ్డగోలు వసూళ్లలో భాగస్వాములవుతున్నారు. రూ.5600కు అమ్మాల్సిన ఇంజక్షన్‌ను రూ.30 వేలకు.. రూ.36 వేలకు అమ్మాల్సిన ఔషధాన్ని ఏకంగా రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకూ కూడా విక్రయిస్తున్నారు. వీటికి బిల్లులు కూడా ఇవ్వడం లేదు.

వెంటిలేటర్ పెట్టాల్సిన సమయం తగ్గుతుంది

కొవిడ్‌ రోజురోజుకూ విజృంభిస్తున్న తరుణంలో మధ్యతరగతి మరింత చితికిపోకుండా ఉండాలంటే.. అత్యవసర ఔషధాల పేరిట కొనసాగుతున్న ఈ అడ్డగోలు దోపిడీని నియంత్రించాల్సిన ఆవశ్యకత ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కరోనా బాధితుల్లో ప్రాణవాయువు అవసరమైన దశలో కొన్ని కీలక ఔషధాలను అందిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయోగాత్మకంగా వినియోగించడానికి మాత్రమే భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) అనుమతించింది. ఈ ఔషధాలు పూర్తిగా పనిచేస్తాయనడానికి ఆధారాలు లభించలేదు. దీనివల్ల మరణాల శాతం కొంత తగ్గొచ్చు లేదా రోగి ఆసుపత్రిలో ఉండాల్సిన రోజుల సంఖ్య.. రోగికి వెంటిలేటర్‌ పెట్టాల్సిన సమయం తగ్గే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రధానమైనవి రెండు. 1.రెమిడెసివిర్‌ 2. టోసిలిజుమాబ్‌. ఈ ఔషధాలను వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇవ్వాలి. అందులోనూ రోగి అంగీకార పత్రం ఇచ్చినప్పుడే వాడాలి.

రెమిడెసివిర్‌

ఈ ఇంజక్షన్‌ 100 ఎంజీలో లభిస్తుంది. తొలిరోజు 100 ఎంజీ చొప్పున రెండు, తర్వాత 4రోజుల పాటు 100 ఎంజీ చొప్పున ఇస్తారు. ప్రధానంగా ఇది వైరస్‌ ఉత్పత్తిని ఆపుతుంది. కరోనా లక్షణాలు మధ్యస్థ(మోడరేట్‌), తీవ్ర(సివియర్‌) దశలో ఉన్నవారికి ఇస్తున్నారు. ఇప్పుడు స్వల్ప లక్షణాలున్న దశలోనూ ఇస్తే ఎలాగుంటుందనే ప్రయోగాలు జరుగుతున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. దీని గరిష్ఠ చిల్లర ధర కంపెనీలను బట్టి రూ.4 వేల నుంచి రూ.5600 వరకూ.. ఆరు డోసులు వినియోగిస్తే.. ఈ ఔషధానికి గరిష్ఠంగా రూ.33,600 కంటే ఎక్కువ ఖర్చు కాకూడదు. కానీ కొందరు ఐదింతలు కూడా వసూలు చేస్తుండడంతో.. రూ.1.68 లక్షలు కూడా ఖర్చు పెట్టాల్సి వస్తోంది.

టోసిలిజుమాబ్‌

సాధారణంగా ఈ ఇంజక్షన్‌ను ఒక డోసు ఇస్తారు. కొన్నిసార్లు రోగి స్థితిని బట్టి 24 గంటల్లో మరో డోసు అవసరమవుతుంది. కరోనా బాధితుల్లో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడానికి ముందుగా స్టెరాయిడ్లు ఇస్తారు. ఎక్కువమందిలో స్టెరాయిడ్‌లతోనే ఆరోగ్యం కుదుటపడుతుంది. శరీరంలో సైటోకైన్స్‌ ఉప్పెనలా పెరిగిపోయినప్పుడు.. ఈ ప్రమాదకర స్థితిలో రోగి ఆరోగ్యం విషమిస్తుందని భావించినప్పుడు.. టోసిలిజుమాబ్‌ ఔషధాన్ని ఉపయోగిస్తారు. దీనివల్ల ఎంత ఉపయోగం ఉంటుందనేది కచ్చితంగా తేలలేదు. కోలుకునే వారి శాతం బాగానే ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. దీని గరిష్ఠ చిల్లర ధర రూ.36,000. రెండు డోసులు వాడాల్సి వస్తే రూ.72 వేలు అవుతుంది. కానీ అత్యధిక ధరలకు విక్రయిస్తుండడంతో.. రెండు డోసులకు రూ.3.60 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ఈ ఔషధాలకే ఇన్ని లక్షలు అయితే.. ఇక మొత్తం కొవిడ్‌ చికిత్సకు కార్పొరేట్‌లో ఎంత ఖర్చవుతుందో తలుచుకుంటేనే భయమేస్తుంది.

పరిమిత సంఖ్యలో ఉత్పత్తి

రాష్ట్రంలోనూ కొన్ని సంస్థలు పరిమిత సంఖ్యలో రెమిడెసివిర్‌ ఔషధాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఈకారణంగా అవసరాలకు సరిపోవడం లేదని తెలుస్తోంది. తెలంగాణకే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా వాటిని సరఫరా చేస్తుండడంతో కొంత లోటు కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్లిష్ట సమయంలో ఈ ఔషధాల ఉత్పత్తిని పెంచే దిశగా చర్యలు చేపట్టాలి. కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రాణాధార ఔషధాలను దాచిపెట్టి, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం సూచించిన ధరలకే ఈ ఔషధాలను పారదర్శకంగా విక్రయించేలా ఔషధ నియంత్రణాధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆసుపత్రి దుకాణంలో అధికమే

ఒక కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్‌ బాధితునికి శ్వాస సంబంధ సమస్యలు ఎక్కువయ్యాయి. ప్రాణాధార ఔషధాలు ప్రయత్నించాలని వైద్యుడు సూచించారు. అదే ఆసుపత్రిలోని ఔషధ దుకాణంలో సంప్రదిస్తే.. గరిష్ఠ చిల్లర ధర కంటే ఐదింతలు ఎక్కువ చెప్పారు. బయట దుకాణాల్లో ఎక్కడా దొరక్కపోవడంతో ఆసుపత్రి దుకాణంలోనే కొనుగోలు చేయాల్సి వచ్చింది.

ఇదీ చదవండి: హోం క్వారంటైన్​లో ఉన్నవారికి కరోనా కిట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.